Rajat Patidar : ఆర్సీబీ కెప్టెన్ మామూలోడు కాదయ్యా.. రజత్ పాటిదార్ నెట్‌వర్త్ ఎంతంటే?
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రజత్ పాటిదార్ (Rajat Patidar) అద్భుతంగా నడిపిస్తున్నాడు.
Rajat Patidar Net Worth 2026 IPL Salary and Assets details report (pic credit@rcb)
Rajat Patidar : ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును రజత్ పాటిదార్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. 2025లో ఆర్సీబీని విజేతగా నిలిపిన అతడు ఐపీఎల్ 2026 సీజన్లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. రజత్ పాటిదార్ నికర ఆస్త్తి విలువ 2026 నాటికి 25 నుంచి 30 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆయన ఆదాయంలో ఎక్కువ భాగం ఐపీఎల్ నుంచే వస్తుంది. 2021లో ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అరంగ్రేటం చేశాడు. ఆ సమయంలో 20లక్షలను అందుకున్నాడు.
Rajat Patidar : రజత్ పాటిదార్ వరల్డ్ రికార్డు.. టీ20ల్లో ఒకే ఒక కెప్టెన్..
2022, 2024 సీజన్లలో 50 లక్షల చొప్పున అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2025 ముందు ఆర్సీబీ అతడిని 11 కోట్లకు రిటైన్ చేసుకుంది. అప్పటి నుంచి ఒక్కొ సీజన్‌కు 11 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నాడు. దీంతో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా మంచి మొత్తాలను సంపాదిస్తున్నాడు.
ఇండోర్‌లో రజత్‌కు ఓ రెండు అంతస్థుల బంగ్లా ఉంది. దీని విలువ 4 నుంచి 6 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన ఇంట్లో ప్రైవేట్ జిమ్, హోమ్ థియేటర్ ఉంది. ఇక కార్ల కలెక్షన్ విషయానికి వస్తే.. అతడి వద్ద హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా థార్ వంటి కార్లు ఉన్నాయి.
పాటిదార్ ఎంత సాధించినా కూడా వినమ్రంగా ఉంటాడు. అతడు పెద్దగా లగ్జరీ జీవితాన్ని ఇష్టపడడు. సింపుల్‌గా ఉండడమే అతడికి ఇష్టం. క్రికెట్ పైనే అతడి పూర్తి ఫోకస్ ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీని విజేతగా నిలిపితే రానున్న సీజన్లలో అతడి పారితోషికం మరింత పెరగొచ్చు.
