MS Dhoni : ధోని సార్.. 60 ఏళ్ల వరకు ఆడండి.. మహికి హీరో శివ కార్తికేయన్ రిక్వెస్ట్
అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని (MS Dhoni ) ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- March 23, 2026 / 12:41 PM IST
Hero Sivakarthikeyan request to ms dhoni to play till 60 age
MS Dhoni : అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. 44 ఏళ్ల ధోని క్రికెట్ కెరీర్ చరమాంకంలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ముందు ఇదే ధోని చివరి సీజన్ అంటూ ప్రచారం సాగుతుండగా.. అలాంటిది ఏమీ లేదంటూ దిగ్గజ ఆటగాడు ఆడుతూనే ఉన్నాడు. ఇక అతడి అభిమానులు అయితే.. ఎప్పటికి ధోని ఆడుతూనే ఉండాలని కోరుకుంటున్నారు.
ధోనికి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆడాలని తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కోరాడు. ఆదివారం చెన్నైలోని చెపాక్ మైదానంలో సీఎస్‌కే రోర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకార్తికేయన్.. ధోని ఆట అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
Hardik Pandya : హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. లక్ష్యం అదే.. ఇక పై..
ధోని లాంటి దిగ్గజం ముందు నిలబడాలంటే తనకు కాస్త కంగారుగా ఉందన్నాడు. ధోని లాగా తాను కూల్ కాదన్నాడు. అందుకనే కాస్త భయంగా ఉందన్నాడు. ధోనిని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఇదే చివరి ఐపీఎల్ సీజనా అని అడిగినప్పుడు ధోని ఖచ్చితంగా కాదని సమాధానం ఇచ్చారు. ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో ధోని నుంచి అలాంటి సమాధానమే తాము వినాలని అనుకుంటున్నట్లు శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.
వెంటనే ధోని మాట్లాడుతూ.. అది చాలా కష్టం అని అన్నాడు. మీరు ఎన్ని సంవత్సరాలు ఆడినా చూస్తామని, 60 ఏళ్ల వయసు వరకు ఆడాలని కోరుకుంటున్నట్లు శివ కార్తికేయన్ తెలిపాడు. ధోని ఫిట్‌నెస్ ఇదేమంత కష్టం కాదన్నాడు. వెంటనే ధోని మాట్లాడుతూ.. తాను ప్రయత్నిస్తానని అన్నాడు. తాము వినాలని అనుకుంటున్న మాట ఇదేనని శివకార్తికేయన్ అన్నాడు. అప్పుడు స్టేడియం ప్రేక్షకుల అరుపులతో హోరెత్తిపోయింది.
