CSK : ధోని కీపింగ్, సంజూ బ్యాటింగ్, ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్.. ట్విస్ట్ అదుర్స్.. వీడియో వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK ) ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు.
Sanju Samson Takes On Muttiah Muralitharan and MS Dhoni As Keeper video viral
CSK : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఫ్యాన్స్ కోసం సీఎస్కే మేనేజ్మెంట్ ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీఎస్కేకు చెందిన ప్రస్తుత ఆటగాళ్లతో పాటు మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ క్రమంలో ఓ సరదా మ్యాచ్‌ను నిర్వహించారు.
మాజీ సీఎస్కే ఆటగాళ్లు ఓ జట్టుగా, ప్రస్తుత ఆటగాళ్లు మరో జట్టుగా విడిపోయి మ్యాచ్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా సందర్భాన్ని చూశారు.
Sanju Samson vs Muttiah Muralitharan full contest 😂💛
This is so fun💛
Sanju was almost stumped by MS Dhoni but he missed 😅 pic.twitter.com/vcNPA3X3AG
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) March 22, 2026
ఐపీఎల్ ట్రేడింగ్‌లో రాజస్థాన్ నుంచి చెన్నైకు వచ్చిన సంజూ శాంసన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ చేశాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాడు ముత్తయ్య మురళీ ధరన్ బౌలింగ్ వేశాడు. మురళీ ధరన్ బౌలింగ్‌లో సంజూ కాస్త ఇబ్బంది పడ్డాడు. తొలి రెండు బంతులను డాట్లు ఆడాడు. అయితే.. మూడో బంతికి భారీ షాట్ కు ఆడాలని అనుకుని క్రీజు దాటి ముందుకు వచ్చాడు. ఈజీగా స్టంపౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికి కూడా ధోని కావాలని మిస్ చేసినట్లుగా కనిపించింది.
ఆ తరువాతి బంతికి సైతం శాంసన్ సరిగ్గా ఆడలేకపోయాడు. ఎట్టకేలకు చివరి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో చెపాక్ మైదానంలో పెద్ద ఎత్తున కేరింతలు వినిపించాయి.
