తన 16 సంవత్సరాల గోల్డెన్ పిరియడ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆగస్టు 15 న తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మహేంద్ర సింగ్ ధోని. ధోని రాజీనామా చేసినప్పటి నుంచి అతని మాజీ సహచరులు చాలా మంది ధోనితో ఉన్న అనుబంధాన్ని, అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చాలా మంది భారతీయ క్రికెటర్లకు గురువు మరియు రోల్ మోడల్‌గా ఉన్నారు. కెప్టెన్‌గా ఉన్న కాలంలో, ధోని యువ ప్రతిభను గుర్తించి వారి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేవాడు. ఆధునిక క్రికెట్‌లో చాలా మంది అనుభవజ్ఞులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ మరియు సురేష్ రైనా తరచూ ధోని గురించి ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు.
https://10tv.in/arizona-man-earns-3-lakh-rupees-per-month-by-letting-people-with-a-foot-fetish/
ఈ క్రమంలోనే భారత యువ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ తన క్రికెట్ కెరీర్‌లో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ ధోని సహకారాన్ని గుర్తుచేసుకున్నాడు. రాహుల్ ఒక వీడియోలో మాట్లాడుతూ, “ఇది మొత్తం దేశానికి మరియు ప్రపంచ క్రికెట్‌కు భావోద్వేగ క్షణం. మేమంతా ఎంఎస్ ధోనిలా అవ్వాలని పరితపించేవాళ్లం. ముఖ్యంగా ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన నా లాంటి వ్యక్తికి, వ్యక్తులకు హీరో ఎంఎస్ ధోని.” అని అన్నా కేఎల్ రాహుల్.