IPL 2026 Prize Money: ఆర్‌సీబీకి 20 కోట్లు ఇచ్చారు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరీ ఇంత తక్కువ ఇచ్చారేంట్రా..
ఐపీఎల్ 2026 (IPL 2026 Prize Money) విజేతగా నిలిచిన ఆర్‌సీబీ ప్రైజ్‌మనీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 1, 2026 / 12:13 PM IST
How Much Money Did RCB Win After IPL 2026 Final
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. అహ్మదాబాదాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్‌సీబీ ప్రైజ్‌మనీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ పై కూడా కోట్ల వర్షం కురిసింది. క్వాలిఫయర్-2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్, ఎలిమినేటర్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు కూడా భారీ మొత్తాన్నే అందుకున్నాయి.
ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్‌సీబీ 20 కోట్లు ప్రైజ్‌మనీగా అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌కు రూ.12.5 కోట్ల నగదు బహుమతి అందుకుంది. ఈ సీజన్‌లో క్వాలిఫయర్-2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 7 కోట్లు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్లు ప్రైజ్‌మనీగా అందాయి.
ఇక ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించిన పలువురు ఆటగాళ్లు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎవరు ఏ అవార్డును గెలుచుకున్నారో ఓ సారి చూద్దాం..
ఐపీఎల్ 2026 అవార్డులు.. పూర్తి జాబితా..
- ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ – విరాట్ కోహ్లీ
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ – వైభవ్ సూర్యవంశీ
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ – వైభవ్ సూర్యవంశీ
- సీజన్‌లో అత్యధిక సిక్సులు – వైభవ్ సూర్యవంశీ
- సీజన్‌లో అత్యధిక డాట్ బాల్స్ – మహమ్మద్ సిరాజ్
- బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ – మనీష్ పాండే
- ఫెయిర్‌ప్లే అవార్డు – పంజాబ్ కింగ్స్
- పర్పుల్ క్యాప్ – కగిసో రబాడా
- ఆరెంజ్ క్యాప్ – వైభవ్ సూర్యవంశీ
- అత్యంత విలువైన ఆటగాడు (MVP) – వైభవ్ సూర్యవంశీ
