Sale of IPL Tickets : ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు.. స్టేడియాన్ని ముట్టడిస్తాం..!
హెచ్‌సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు.
- Sreehari A
- Updated on- April 24, 2024 / 11:23 PM IST
Huge illegal sale of IPL tickets
Sale of IPL Tickets : ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నదని ఆయన అన్నారు.
అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్లకు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందన్నారు.
హెచ్‌సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు. సాట్ చైర్మన్ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ ముట్టడించనుంది.
ఉదయం 10 గంటలకు శివసేన రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకోనున్నారు. కాంగ్రెస్ అభిమానులతో పాటు యూత్ కాంగ్రెస్ భారీగా ఉప్పల్ స్టేడియం వద్దకు తరలిరావాలని శివసేనరెడ్డి పిలుపునిచ్చారు.
Read Also : ‘అదేం వీరబాదుడు.. అవేం పరుగులు..’ ఐపీఎల్‌లో జరుగుతోన్న పరిణామాలపై వసీం అక్రమ్ నిబిడాశ్చర్యం
