MS Dhoni: ధోనీని కలవడంతో నా కల నిజమైంది – పాకిస్తాన్ పేసర్

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పాక్ పేసర్ హగ్ చేసుకున్న మరో ఫొటో వైరల్ అయింది. షెహ్నవాజ్ దహానీ అనే పేసర్ ధోనీని కలుసుకునే అవకాశం దక్కించుకున్నాడు.

Ms Dhoni

MS Dhoni: ఇండియా – పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగి దాదాపు సంవత్సరం పూర్తి అయింది. రెండేళ్ల తర్వాత తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలో తలపడిన పోరులో పాక్ 10వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ సమయంలో పాక్ క్రికెటర్లు ఇండియన్ ప్లేయర్లను హగ్ చేసుకున్న మూమెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని మొహమ్మద్ రిజ్వాన్ హగ్ చేసుకున్న ఫొటో ఒకటి వైరల్ అయింది. దీంతో పాటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పాక్ పేసర్ హగ్ చేసుకున్న మరో ఫొటో వైరల్ అయింది. షెహ్నవాజ్ దహానీ అనే పేసర్ ధోనీని కలుసుకునే అవకాశం దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ కు మెంటార్ గా ధోనీ వ్యవహరించడంతో రిటైర్ అయినప్పటికీ ఆ సమయంలో టీమిండియాతో కలిసే ఉన్నాడు.

‘మహేంద్ర సింగ్ ధోనీ స్థాయి గురించి వివరించడానికి చాలా సమయం పడుతుంది. అతణ్ని కలవాలనుకునే కల నిజమైంది. ఆ క్షణం ఇప్పటికీ మర్చిపోలేను. అతని మాటలు నాకు అలా గుర్తుండిపోయాయి. జీవితం గురించి చాలా బాగా చెప్పారు. పెద్దలను గౌరవించాలని, క్రికెట్ లో మంచి, చెడు రెండూ ఉంటాయని వాటిని అంకితభావంతో ఎదుర్కోవాలని సూచించాడు. అన్నింటికంటే నీ గేమ్ ను నువ్వు ప్రేమించాలని’ ధోనీ చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు.

Read Also: పాకిస్తాన్ పేసర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన ఎంఎస్ ధోనీ

23ఏళ్ల దహానీ పాకిస్తాన్ తరపున రెండు టీ20లు ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. న్యూజిలాండ్ గ్రేట్ ప్లేయర్ షేన్ బాండ్ ను ఆదర్శంగా తీసుకుని ఎదిగానని చెప్తున్న షేన్వాజ్.. ప్రస్తుత కల ఇంగ్లాండ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ ను కలవడం.