ICC ban: బంగ్లాదేశ్ పేసర్‌ను నిషేదించిన ఐసీసీ

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ ప్లేయర్ షాహిదుల్ ఇస్లామ్ ను 10నెలల పాటు నిషేదిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మార్చి నెలలో జరిపిన డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గానూ ఈ పనిష్మెంట్ విధించింది.

Shohidul Islam

 

 

ICC ban: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ ప్లేయర్ షాహిదుల్ ఇస్లామ్ ను 10నెలల పాటు నిషేదిస్తూ ఆదేశాలు ఇచ్చింది. మార్చి నెలలో జరిపిన డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గానూ ఈ పనిష్మెంట్ విధించింది. బంగ్లాదేశ్ పేసర్ యూరిన్ శాంపుల్‌ను పరీక్షలుకు పంపగా.. క్లామిఫెన్ అనే పదార్థం తీసుకున్నట్లు తెలిసింది.

ఐసీసీ నిషేదిత జాబితాలో ఉన్న డ్రగ్ కావడంతో కాంపిటీషన్ నుంచి తప్పించారు. ఆర్టికల్ 2.1 ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం 10నెలల నిషేదం విధించాం. తనకు తానుగానే నేరాన్ని ఒప్పుకున్నాడు షాహిదుల్ అని ఐసీసీ స్టేట్మెంట్ లో పేర్కొంది.

సస్పెన్షన్‌ను అందజేసేటప్పుడు, చికిత్సా ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా సూచించిన మెడిసిన్ రూపంలో షాహిదుల్ పొరబాటుగా నిషేధిత పదార్థాన్ని తీసుకున్నట్లు ICC ధృవీకరించింది. నిషేధిత పదార్థాన్ని ఉపయోగించాలనే ఉద్దేశం తనకు లేదని షోహిదుల్ వాంగ్మూలం ఇచ్చాడు. 10 నెలల సస్పెన్షన్ మే 28 వరకూ అమల్లో ఉంటుంది. బంగ్లాదేశ్ పేసర్ మార్చి 28, 2023 నుండి ఆడటానికి అర్హత దక్కుతుంది.

Read Also : ఐసీసీ ప్రోమో చూశారా? రిషబ్ పంత్ గ్రాండ్ వెల్‌కమ్ అదిరింది.. వీడియో!

27 ఏళ్ల పేసర్ బంగ్లాదేశ్ తరఫున ఒక్క T20 మాత్రమే ఆడాడు. పాకిస్తాన్ 3-0తో గెలిచిన సిరీస్‌లోని మూడో చివరి మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ వికెట్‌ను తీసుకున్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ ట్రావెలింగ్ స్క్వాడ్‌లలో భాగంగా ఉన్నాడు. వెస్టిండీస్ పర్యటన కోసం బంగ్లాదేశ్ టెస్ట్, T20 జట్టులో కూడా భాగంగా ఉన్నాడు.