T20 World Cup 2022 : ఐసీసీ ప్రోమో చూశారా? రిషబ్ పంత్ గ్రాండ్ వెల్‌కమ్ అదిరింది.. వీడియో!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. రోజురోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి.

T20 World Cup Icc Welcomes Rishabh Pant To The ‘biggest Tournament Of The Year
T20 World Cup 2022 : టీ20 ప్రపంచకప్ సమీపిస్తోంది. రోజురోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రణాళికలను రెడీ చేసుకుంటున్నాయి. లేటెస్టుగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించి వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో టీమిండియా యువ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐసీసీ రిలీజ్ చేసిన ఈ వీడియోలో పంత్ లుక్, స్టిల్ కూడా డిఫరెంట్‌గా అనిపిస్తోంది.
వెల్‌కం టు ద బిగ్ టైం, రిషబ్ పంత్ అంటూ క్యాఫ్షన్ పెట్టింది. ‘బిగ్ టైమ్’ అని పేర్కొంది. ప్రోమోలో పంత్ కనిపించే చోట నుంచి సిడ్నీ హార్బర్ ఒడ్డున ఉన్న సిడ్నీ ఒపేరా హౌస్ మీదుగా హెలికాప్టర్ తిరుగుతోంది. అతను ‘గాడ్జిల్లా’ మాదిరిగా నగరంలోకి ప్రవేశించినట్టుగా క్లాసిక్ ‘డ్రాగ్ ద బ్యాట్’ వాక్‌లో కనిపిస్తాడు.
రిషబ్ పంత్ గత కొన్నేళ్లుగా టీమిండియాలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఆధునిక క్రికెట్‌లో రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలో తన సత్తా చాటగలడు. ఫాస్ట్ బౌలర్లకు చుక్కలు చూపించడంలో జేమ్స్ ఆండర్సన్ రివర్స్ ల్యాప్ చేయగలడు. ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని పంత్ సంపాదించుకున్నాడు.
View this post on Instagram
కేఎల్ రాహుల్ ఔట్ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల హోమ్ సిరీస్‌లో పంత్ భారత జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. 2020/21 రెడ్ బాల్ టూర్‌లో ఆస్ట్రేలియాను చితక్కొట్టిన పంత్.. ఆ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో గబ్బాలో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ద్వారా ఆస్ట్రేలియాలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
Read Also : T20 team: భారత్‌కు ‘పవర్ హౌస్’లాంటి క్రికెట్ జట్టు ఉంది: ఆష్లీ జిలెజ్