NED vs BAN : బంగ్లాదేశ్ పై 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో నెదర్లాండ్స్ తలపడుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- October 28, 2023 / 09:28 PM IST
NED vs BAN
నెదర్లాండ్స్ విజయం
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.2వ ఓవర్లో 142 పరుగులకు ఆలౌటైంది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 87 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్ (35; 40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ నాలుగు వికెట్లు తీశాడు. బాస్ డి లీడే రెండు పడగొట్టాడు. లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కోలిన్ అకెర్మాన్ తలా ఓ వికెట్ సాధించారు.
బంగ్లాదేశ్ టార్గెట్ 230
నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68; 89 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ బరేసి (41), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (35), లోగాన్ వాన్ బీక్(23 నాటౌట్) లు రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్ లు తలా రెండు వికెట్లు తీశారు. కెప్టెన్ షకీబ్ ఓ వికెట్ పడగొట్టాడు.
బంగ్లాదేశ్ తుది జట్టు : తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం
నెదర్లాండ్స్ తుది జట్టు : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), బాస్ డి లీడే, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
Netherlands vs Bangladesh : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో నెదర్లాండ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు చెరో ఐదు మ్యాచులు ఆడగా ఒక్కొ మ్యాచులో మాత్రమే విజయం సాధించాయి. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆఖరి స్థానంలో ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్ మరో సంచలనం సృష్టించాలని ఆరాటపడుతోంది.
