ICC World Cup 2023: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాకిచ్చింది. వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆడే స్టేడియాలను మార్పు చేయాలని పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తులను ఐసీసీ పట్టించుకోలేదు.
- Harishth Thanniru
- Published On : June 27, 2023 / 02:08 PM IST
ODI World Cup 2023
ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023 (ICC Mens Cricket World Cup 2023) మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది. మంగళవారం ఐసీసీ (ICC) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది జట్లు ఫైనల్ అయ్యాయి. మరో రెండు జట్లు టోర్నీలో ఆడేందుకు క్వాలిఫయర్ మ్యాచ్‌లలో ఆడుతున్నాయి. జులై 9న క్వాలిఫయర్ టోర్నమెంట్ ముగింపులో మొదటి, రెండు స్థానాల్లో నిలిచే జట్లు మెగాటోర్నీలో ఆడుతాయి.
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూసే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతక్కుపోతుంటారు. వరల్డ్ కప్‌లో హై వోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మారింది. అక్టోబర్ 15న పాకిస్థాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. తొలుత బీసీసీఐ ఈ స్టేడియాన్ని ఖరారు చేయగా.. నరేంద్రమోదీ స్టేడియంలో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మ్యాచ్ వేదిక మారుతుందని భావించినప్పటికీ.. ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు.
అదేవిధంగా.. పాకిస్థాన్ జట్టు చెన్నైలో ఆఫ్గానిస్థాన్ జట్టుతో, బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ స్టేడియంలలో మ్యాచ్‌లు ఆడమని, ఆ వేదికలు మార్చాలని ఐసీసీని కోరింది. కానీ, బీసీసీఐ, ఐసీసీలు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు గట్టి షాకిచ్చాయి. పాక్ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ముందుగానే నిర్ణయించినట్లుగానే ఆ రెండు వేదికల్లోనే ఆఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అయితే, ఐసీసీ నిర్ణయం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది.
వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌ల షెడ్యూల్
ICC World Cup 2023 Schedule
