×
Ad

T20 World Cup 2026 : భార‌త్‌తో మ్యాచ్ బ‌హిష్క‌రిస్తే.. ‘పాక్ పై చర్యలు ఊహాతీతం’.. ICC మాస్టర్ ప్లాన్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026 )భార‌త్‌తో మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల‌నే పాక్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై చ‌ర్చించేందుకు ఐసీసీ బోర్డు మీటింగ్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ICC is set to call a board meeting to discuss Pakistan threat to boycott T20 World Cup match against India

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా భార‌త్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల‌ని త‌మ జ‌ట్టుకు పాక్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో ప్రేమదాస స్టేడియంలో ఫిబ్ర‌వ‌రి 15న జ‌ర‌గాల్సిన భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ పై అనిశ్చితి నెల‌కొంది. దీంతో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ‌రో రెండు రోజుల్లో బోర్డు స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐసీసీ బోర్డు.. మంగళవారం లేదా బుధవారం సమావేశమయ్యే అవకాశం ఉంద‌ని, ఈ స‌మావేశంలో భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ అనిశ్చితి, త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ భార‌త్‌తో మ్యాచ్‌ను పాక్ బ‌హిష్క‌రిస్తే.. అప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి పాక్‌ను స‌స్పెండ్ చేసే అవ‌కాశాన్ని ప‌రిశీలించ‌నున్న‌ట్లు ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి.

Mitchell Marsh : భార‌త్‌తో మ్యాచ్‌ను పాక్ బ‌హిష్క‌రించ‌బోతుంది? పాక్ రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్

ఆంక్షలలో ఇవి ఉండవచ్చు?

* పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో విదేశీ ఆటగాళ్లకు నో ఛాన్స్‌. లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు ర‌ద్దు, వాణిజ్య మద్దతు ఉప‌సంహ‌రణ‌.
* ఐసీసీ నుంచి వ‌చ్చే ఆదాయంలో భారీ కోత‌
* భార‌త్ వర్సెస్ పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోతే.. ప్రసార సంస్థ‌కు క‌లిగే ఆర్థిక న‌ష్టాన్ని భ‌ర్తీ చేయాల‌ని కోర‌డం
* ఆసియాక‌ప్ నుంచి తొల‌గింపు
* పాక్‌తో అన్ని జ‌ట్ల ద్వైపాక్షిక సిరీస్‌ల ర‌ద్దు

ICC : భార‌త్‌తో ఆడొద్దు.. పాక్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం పై ఐసీసీ రియాక్ష‌న్ ఇదే .. అలా చేస్తే..

శ్రీలంక‌కు భార‌త్..!

పాక్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఎలాగున్న‌ప్ప‌టికి కూడా ఐసీసీ షెడ్యూల్ మేర‌కు భార‌త జ‌ట్టు శ్రీలంక‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సెష‌న్ల‌లో పాల్గొన‌డంతో పాటు మ్యాచ్‌కు ముందు రోజు నిర్వ‌హించే విలేక‌రుల స‌మావేశంలోనూ పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక మ్యాచ్ రోజు నిర్ణీత స‌మ‌యంలోగా మైదానానికి వెళ్లి అక్క‌డ మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణ‌యం కోసం భార‌త్ వేచిచూడ‌నుండ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.