T20 World Cup 2026: విండీస్ తో కీలక మ్యాచ్.. భారత్ ముందు బిగ్ టార్గెట్
- Naveen
- Updated on- March 1, 2026 / 08:53 PM IST
Pic Courtesy @ EspnCricInfo
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు బ్యాటర్లు రాణించారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఇందులో గెలవాలంటే భారత్ 196 పరుగులు చేయాలి. గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్‌లో అడుగుపెడుతుంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా చావో రేవో లాంటిది.
విండీస్ బ్యాటర్లలో ఓపెనర్లు హోప్ (32), చేజ్ (40) మంచి ఆరంభం ఇచ్చారు. హెట్ మైర్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. చివరలో పావెల్ (34 నాటౌట్), హోల్డర్ (37 నాటౌట్) భారీ షాట్లు కొట్టారు. దీంతో విండీస్ ఛాలెంజింగ్ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశాడు.
