×
Ad

T20I rankings : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో రెండు సెంచ‌రీలు.. రెండో స్థానానికి దూసుకువ‌చ్చిన పాక్ ప్లేయ‌ర్‌.. అభిషేక్ స్థానానికి ముప్పు..

పాకిస్థాన్ స్టార్ ఆట‌గాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో (T20I rankings) అద‌ర‌గొట్టాడు.

ICC Mens T20I batting rankings Sahibzada Farhan closed to Abhishek Sharma

  • ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ పాక్ ఆట‌గాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ దూకుడు
  • రెండో స్థానానికి చేరిక‌
  • మొద‌టి స్థానంలో అభిషేక్ శ‌ర్మ‌కు అత‌డికి మ‌ధ్య తేడా 26 రేటింగ్ పాయింట్లు

T20I rankings : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో రెండు సెంచ‌రీలు చేసిన పాకిస్థాన్ స్టార్ ఆట‌గాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టీ20 ర్యాంకింగ్స్‌లో అద‌ర‌గొట్టాడు. ఓ స్థానం మెరుగుప‌ర‌చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. అత‌డి కెరీర్‌లో ఇదే అత్యుత్త‌మ ర్యాంక్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక భార‌త ఆట‌గాడు అభిషేక్ శ‌ర్మ అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. అయితే.. ప‌ర్హాన్‌కు, అభిషేక్‌కు శ‌ర్మ‌కు మ‌ధ్య తేడా కేవ‌లం 26 రేటింగ్ పాయింట్లు మాత్ర‌మే.

అభిషేక్ శ‌ర్మ ఖాతాలో 874 రేటింగ్ పాయింట్లు ఉండ‌గా, ఫ‌ర్హాన్ ఖాతాలో 848 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు ఫిల్ సాల్ట్ ఓ స్థానం దిగ‌జారి మూడో స్థానానికి ప‌డిపోయాడు. అత‌డి ఖాతాలో 803 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొడుతున్న టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు ఇషాన్ కిష‌న్ ఓ స్థానం మెరుగుప‌ర‌చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అత‌డి ఖాతాలో 783 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మ‌రో భార‌త ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ ఓస్థానం మెరుగుప‌చ‌రుకుని ఆరో స్థానంలో ఉండ‌గా.. పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఓ స్థానం దిగ‌జ‌రి ఏడో స్థానానికి చేరుకున్నాడు.

SA vs NZ : ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌ ర‌ద్దైతే.. ఫైన‌ల్‌లో అడుగుపెట్టేది ఎవ‌రంటే?

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో ఉన్న బ్యాట‌ర్లు వీరే..

* అభిషేక్ శ‌ర్మ (భార‌త్‌) – 874 రేటింగ్ పాయింట్లు
* సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) – 848 రేటింగ్ పాయింట్లు
* ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్‌) – 803 రేటింగ్ పాయింట్లు
* ఇషాన్ కిష‌న్ (భార‌త్‌) – 783 రేటింగ్ పాయింట్లు
* పాతుమ్ నిస్సాంక (శ్రీలంక‌) – 766 రేటింగ్ పాయింట్లు

బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో భార‌త స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు. అత‌డి ఖాతాలో 771 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో అఫ్గానిస్థాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ కొన‌సాగుతున్నాడు. అత‌డి ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ర‌షీద్‌, వ‌రుణ్‌కు మ‌ధ్య 18 రేటింగ్ పాయింట్ల వ్య‌త్యాస‌మే ఉంది.

పాకిస్థాన్ స్పిన్న‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ రెండు స్థానాలు మెరుగు ప‌ర‌చుకుని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అత‌డి ఖాతాలో 736 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు కార్బిన్ బాష్ ఓ స్థానం దిగ‌జారి నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. అత‌డి ఖాతాలో 730 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ ఓ స్థానం దిగ‌జారి ఐదో ర్యాంక్‌కు ప‌డిపోయాడు. అత‌డి ఖాతాలో 719 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్‌.. బుమ్రా ఒక్క వికెట్ తీస్తే చాలు..

టీమ్ఇండియా నుంచి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తితో పాటు జ‌స్‌ప్రీత్ బుమ్రా మాత్ర‌మే టాప్‌-10 బౌల‌ర్ల జాబితాలో ఉన్నారు. 671 రేటింగ్ పాయింట్ల‌తో బుమ్రా ఏడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో ఉన్న బౌల‌ర్లు వీరే..

* వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (భార‌త్) – 771 రేటింగ్ పాయింట్లు
* ర‌షీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) – 753 రేటింగ్ పాయింట్లు
* అబ్రార్ అహ్మ‌ద్ (పాకిస్థాన్) – 736 రేటింగ్ పాయింట్లు
* కార్బిన్ బాష్ (ద‌క్షిణాఫ్రికా) – 730 రేటింగ్ పాయింట్లు
* ఆదిల్ ర‌షీద్ (ఇంగ్లాండ్‌) – 719 రేటింగ్ పాయింట్లు