×
Ad

Under 19 World Cup 2026: వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ.. ఫైనల్స్ లో భారత్ భారీ స్కోర్

వైభవ్ సూర్యవంశీ ఫైనల్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు.

  • Published On : February 6, 2026 / 05:04 PM IST

Vaibhav Sooryavanshi Pic Courtesy @ EspnCricinfo

  • వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్
  • 55 బంతుల్లోనే సెంచరీ
  • ఫైనల్స్ లో ఇంగ్లాండ్ పై భారత్ భారీ స్కోర్

Under 19 World Cup 2026: అండ‌ర్‌-19 వరల్డ్ కప్ 2026లో భాగంగా హ‌రారే వేదిక‌గా ఇంగ్లాండ్‌తో ఫైన‌ల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లాండ్ ముందు బిగ్ టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలవాలంటే 412 పరుగులు చేయాలి.

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఫైనల్స్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సూపర్ సెంచరీ బాదాడు. పరుగుల వరద పారించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్ లో ఏకంగా 15 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయంటే… ఏ రేంజ్ లో బాదాడో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ మాత్రే ఆఫ్ సెంచరీతో మెరిశాడు. 51 బంతుల్లో 53 రన్స్ చేశాడు.

కుందు (40), కనిష్క్(37 నాటౌట్), త్రివేది (32), మల్హోత్రా (30) రాణించారు. భారత్ ఇన్నింగ్స్ లో ఏకంగా 19 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలర్లలో మింటో 3 వికెట్లు తీశాడు. మోర్గాన్, గ్రీన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. 55 బంతుల్లోనే శతకం బాదాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక, ఈ మెగా టోర్నీ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ గా వైభవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

Also Read: ఆర్‌సీబీపై కోట్ల‌ వ‌ర్షం.. విన్నింగ్‌ ప్రైజ్‌మ‌నీ ఎంతో తెలుసా.. ఏ అవార్డు ఎవ‌రు అందుకున్నారంటే?