IND vs PAK : ఇదేం ట్విస్ట్ సామీ.. భారత్, పాక్ మ్యాచ్ లేకుండానే వరల్డ్ కప్ షెడ్యూల్.. రిలీజ్ చేసిన ఐసీసీ
టోర్నీ ఏదైనా సరే భారత్, పాక్ జట్లు (IND vs PAK) తలపడుతున్నాయంటే అంటే ఆ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Published On : November 20, 2025 / 10:11 AM IST
ICC reveals schedule for U-19 World Cup 2026
IND vs PAK : టోర్నీ ఏదైనా సరే భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయంటే అంటే ఆ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా భారత్, పాక్ జట్లను (IND vs PAK) ఒకే గ్రూప్‌లో ఉంచుతూ టోర్నమెంట్ షెడ్యూల్‌లను రూపొందిస్తూ వస్తోంది. అయితే.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌లో మాత్రం ఈ రెండు దేశాలను వేరు వేరు గ్రూపుల్లో ఉంచడం గమనార్హం.
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో అండర్-19 ప్రపంచకప్ 2026 జరగనుంది. రెండు దేశాలలోని ఐదు వేదికలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జింబాబ్వే, నమీబియా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా.. నాలుగేసి జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉండగా.. గ్రూప్-బిలో జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ లు ఉన్నాయి. ఇక గ్రూప్-సిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-డిలో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా లు ఉన్నాయి.
ఈ మెగాటోర్నీ 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది.
టీమ్ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
* జనవరి 15: భారత్ వర్సెస్ అమెరికా (బులవాయో)
*జనవరి 17: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (బులవాయో)
* జనవరి 24: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (బులవాయో)
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..
* 15 జనవరి – USA వర్సెస్ ఇండియా (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 15 జనవరి – జింబాబ్వే వర్సెస్ స్కాట్లాండ్ (తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 15 జనవరి – టాంజానియా వర్సెస్ వెస్టిండీస్ (0 HP ఓవల్, విండ్‌హోక్)
* 16 జనవరి – పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 16 జనవరి – ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్ ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 16 జనవరి – ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( HP ఓవల్, విండ్‌హోక్)
* 17 జనవరి – ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 17 జనవరి – జపాన్ వర్సెస్ శ్రీలంక ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 18 జనవరి – న్యూజిలాండ్ వర్సెస్ USA ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 18 జనవరి – ఇంగ్లండ్ వర్సెస్ జింబాబ్వే ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 18 జనవరి – వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( HP ఓవల్, విండ్‌హోక్)
Shubman Gill : శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ కీలక అప్‌డేట్.. జట్టుతో పాటు గౌహతి వెళ్తాడు గానీ..
* 19 జనవరి – పాకిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 19 జనవరి – శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ (నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 19 జనవరి – దక్షిణాఫ్రికా వర్సెస్ టాంజానియా ( HP ఓవల్, విండ్‌హోక్)
* 20 జనవరి 20 – బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 20 జనవరి – ఆస్ట్రేలియా వర్సెస్ జపాన్ (నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 21 జనవరి – ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 21 జనవరి – ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టాంజానియా ( HP ఓవల్, విండ్‌హోక్)
* 22 జనవరి – జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ ( తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 22 జనవరి – ఐర్లాండ్ వర్సెస్ జపాన్ ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 22 జనవరి – వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా (HP ఓవల్, విండ్‌హోక్)
* 23 జనవరి – బంగ్లాదేశ్ వర్సెస్ USA (తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 23 జనవరి – శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 24 జనవరి – ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 24 జనవరి – A4 v D4 ( HP ఓవల్, విండ్‌హోక్)
* 25 జనవరి – సూపర్ సిక్స్ A1 vs D3 ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్
* 25 జనవరి – సూపర్ సిక్స్ D2 v A3 ( HP ఓవల్, విండ్‌హోక్)
* 26 జనవరి – B4 v C4 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 26 జనవరి – సూపర్ సిక్స్ C1 vs B2 (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 26 జనవరి – సూపర్ సిక్స్ D1 vs A2 ( నమీబియా క్రికెట్ గ్రౌండ్, విండ్‌హోక్)
* 27 జనవరి – సూపర్ సిక్స్ C2 vs B3 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 27 జనవరి – సూపర్ సిక్స్ C3 vs B1 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 28 జనవరి – సూపర్ సిక్స్ A1 vs D2 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 29 జనవరి – సూపర్ సిక్స్ D3 vs A2 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 30 జనవరి – సూపర్ సిక్స్ D1 vs A3 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 30 జనవరి – సూపర్ సిక్స్ B3 vs C1 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 31 జనవరి – సూపర్ సిక్స్ B2 vs C3 ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 01 ఫిబ్రవరి – సూపర్ సిక్స్ B1 vs C2 ( క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 03 ఫిబ్రవరి – మొదటి సెమీ-ఫైనల్ (క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో)
* 04 ఫిబ్రవరి – రెండవ సెమీ-ఫైనల్ ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
* 06 ఫిబ్రవరి – ఫైనల్ ( హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే)
