Vaibhav Suryavanshi : శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్ సూర్యవంశీకి ఐసీసీ వార్నింగ్..? నువ్విక ఇంటికెళ్లొచ్చు
Vaibhav Suryavanshi : శ్రీలంక-ఎ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో తాజా ఘటనపై చర్చ జరిగిందని తెలిసింది. మరోవైపు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రస్తుత వివాదంతో సంబంధం ఉన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
- Harish Thanniru
- Published on- June 16, 2026 / 03:40 PM IST
Vaibhav Suryavanshi
- శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ గొడవ
- శ్రీలంక -ఎ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఘటనపై చర్చ
- ఐసీసీ చర్యలు తీసుకుంటుందా?
Vaibhav Suryavanshi : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ -ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దంబుల్లా వేదికగా సోమవారం నాటి ఈ పోరులో శ్రీలంక చేతిలో భారత్ -ఎ జట్టు పరాజయం పాలైంది. తొలుత ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ డ్రా అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ ఓటమి పాలైంది. చివరిలో వైభవ్ క్రీజులో ఉన్నాడు.. మ్యాచ్ పూర్తికావడంతో పెవిలియన్ వైపు వెళ్తుండగా.. శ్రీలంక ప్లేయర్లు వైభవ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడం.. వైభవ్ వారిమీదకు దూసుకెళ్లి గొడవ పెట్టుకోవటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : FIFA World Cup : ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ ఎన్ని సార్లు ఆడిందో తెలుసా?
అయితే, వైభవ్‌కు అంత తీవ్రస్థాయిలో కోపం రావడానికి కారణం ఉందట. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పెవిలియన్ వైపు వెళ్తున్న వైభవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం. అంతేకాక కాస్త ఎగతాళిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్ .. ఏమంటున్నావు’ అంటూ విశేణ్ హలంబగే మీదకు వెళ్లడంతో ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో శ్రీలంక ప్లేయర్లు వైభవ్ ను అక్కడి నుంచి పంపించివేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ అనంతరం ఈ జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు.
ఈ ఘటనపై శ్రీలంక-ఎ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ ఘటనపై చర్చ జరిగిందని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రస్తుత వివాదంతో సంబంధం ఉన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు.. తగినంత వెలుతురు లేదని సమాచారం ఉన్నప్పటికీ ‘సూపర్ ఓవర్’ను కొనసాగించడానికి అనుమతించినందుకు మ్యాచ్ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లో వారిపై ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
