ICC World Cup 2023 : ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్‌కు వస్తే.. జరిగేది ఇదే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 కి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : June 27, 2023 / 04:09 PM IST
If Pakistan qualify for semi finals
ICC World Cup : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 కి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 10 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 5న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
ఇదిలా ఉంటే.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ వేదికలో ఆడేందుకు పాక్ అభ్యంతరం చెప్పినప్పటికీ ఐసీసీ పెద్దగా పట్టించుకోలేదు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15, 16 తేదీల్లో ముంబై, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్ మ్యాచ్‌లు జరనున్నాయి.
ICC World Cup 2023: పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు..
పాయింట్ల పట్టికలో మొదటి, నాలుగో స్థానంలో నిలిచిన జట్ల మధ్య నవంబర్ 15న ముంబైలోని వాంఖడే వేదికగా మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పాక్ సెమీస్‌కు క్వాలిఫై అయితే..
ఒకవేళ పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే.. పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో నిలిచారు అన్న దానితో సంబంధం లేకుండా కోల్‌కతాలోనే పాకిస్థాన్ సెమీఫైనల్ ఆడనుందని ఐసీసీ తెలిపింది. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ లు తలపడాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ మ్యాచ్‌ను కోల్‌కతాలోనే నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెమీస్‌లో పాక్‌తో తలపడాల్సిన అవసరం లేకుంటే ఆ మ్యాచ్‌ను వాంఖడేలోనే భారత్ ఆడనుంది.
World Cup Qualifier : దంచికొట్టిన జింబాబ్వే బ్యాటర్లు.. వన్డేల్లో అత్యధిక స్కోరు
