Incredible Run Out : వార్నీ.. ఇలాంటి ర‌నౌట్‌ను మీ జీవితంలో చూసి ఉండ‌రు.. వీడియో వైర‌ల్..

ఇలాంటి ర‌నౌట్‌ను (Incredible Run Out ) దాదాపుగా చూసి ఉండ‌రు.

Incredible Run Out In Delhi Premier League 2026 video viral

Incredible Run Out : ఇలాంటి ర‌నౌట్‌ను దాదాపుగా చూసి ఉండ‌రు. ఆఖ‌రి బంతి ఒక్క ప‌రుగు కావాల్సి స‌మ‌యంలో బ్యాట‌ర్ షాట్ కొట్ట‌గా.. బంతిని అందుకోవ‌డంలో బౌలింగ్ ఎండ్‌లో ఉన్న ఫీల్డ‌ర్ విఫ‌లం అయ్యాడు. అయితే.. అదృష్ట వ‌శాత్తు బంతి అత‌డిని తాకి అత‌డికి కాస్త ద‌గ్గ‌ర‌లోనే ఆగింది. బంతిని మిస్ అయ్యాన‌న్న కోపంలో స‌ద‌రు ఫీల్డ‌ర్ కాలితో బంతిని త‌న్నాడు. ఆ బంతి కాస్త వికెట్ల‌ను తాకి బెయిల్స్‌ను ప‌డ‌గొట్టింది. అయితే.. అప్ప‌టికి కూడా స‌ద‌రు బ్యాట‌ర్ బౌలింగ్ ఎండ్ క్రీజును చేరుకోలేదు. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో చోటు చేసుకుంది.

ఔట‌ర్ ఢిల్లీ వారియ‌ర్స్‌, న్యూఢిల్లీ టైగ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ వారియ‌ర్స్ విజ‌యానికి ఆఖ‌రి బంతికి ఒక్క ప‌రుగులు అవ‌స‌ర‌మైంది. న్యూఢిల్లీ టైగ‌ర్స్ బౌల‌ర్ ల‌క్ష్మ‌ణ్ వేసిన ఆఖ‌రి బంతిని బ్యాట‌ర్ ప్ర‌దామ్ మిడాప్ దిశ‌గా షాట్ ఆడి సింగిల్ కోసం ప‌రిగెత్తాడు.

Babar Azam : అరే.. అజామూ.. ఇదేం ద‌రిద్రం రా సామీ..

అయితే.. అక్క‌డే ఉన్న ఫీల్డ‌ర్ హిమ్మ‌త్ బంతిని అందుకునేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లం అయ్యాడు. దీంతో అత‌డు తీవ్ర అస‌హ‌నానికి గురి అయ్యాడు. ఈ ఫ్ర‌స్టేష‌న్‌లో అత‌డు బంతిని కాలుతో త‌న్న‌గా అది వికెట్ల‌ను తాకింది. బ్యాట‌ర్ క్రీజును చేర‌క‌పోవ‌డంతో ర‌నౌట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక సూప‌ర్ ఓవ‌ర్‌లో ఔట‌ర్ ఢిల్లీ వారియ‌ర్స్ విజ‌యం సాధించింది.