Vaibhav Sooryavanshi : వైభ‌వ్ విధ్వంసం.. రెచ్చగొట్టిన లంక ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు.. 324.14 స్ట్రైక్‌రేటుతో 10 ఫోర్లు, 8 సిక్స‌ర్లు

త‌న‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మ‌రోసారి వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) చూపించాడు.

IND-A vs SL-A Tri series final Vaibhav Sooryavanshi creates history 11 balls fifty

Vaibhav Sooryavanshi : త‌న‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మ‌రోసారి వైభ‌వ్ సూర్య‌వంశీ చూపించాడు. ఆదివారం దంబుల్లా అంత‌ర్జాతీయ స్టేడియంలో శ్రీలంక‌తో జ‌రుగుతున్న ముక్కోణ‌పు సిరీస్ ఫైన‌ల్ మ్యాచ్‌లో వైభ‌వ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

కేవ‌లం 11 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కం బాదేశాడు. ఈ నేప‌థ్యంలో లిస్ట్‌-ఏ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో అత‌డు 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స‌ర్లు సాయంతో 94 ప‌రుగులు సాధించాడు. తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్న‌ప్ప‌టికి కూడా 324.14 స్ట్రైక్‌రేటుతో అత‌డు లంక బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు.

IND vs AFG : ఆ ఒక్క త‌ప్పిదం వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. అఫ్గాన్ కెప్టెన్ హ‌ష్మ‌తుల్లా షాహిదీ కామెంట్స్‌..

మ్యాచ్‌లో తొలి బంతి నుంచే వైభ‌వ్ దూకుడును ప్రదర్శించాడు. మహ్మద్ షిరాజ్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించి త‌న ఉద్దేశ్యాన్ని చాటి చెప్పాడు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా భారీ షాట్లతో మైదానం న‌లుమూల‌లా భారీ షాట్లు ఆడాడు. అత‌డి ధాటికి లంక బౌల‌ర్లు గ‌తి త‌ప్పారు. మహ్మద్ షిరాజ్ వేసిన ఓ ఓవ‌ర్‌లో ఏకంగా 26 ప‌రుగులు పిండుకున్నాడు. అతని దూకుడు కారణంగా శ్రీలంక బౌలర్లు పూర్తిగా ఒత్తిడిలో పడిపోయారు.

గ‌త మ్యాచ్‌లో వైభ‌వ్‌ను రెచ్చ‌గొట్టిన లంక ప్లేయ‌ర్లు..

భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త జ‌ట్టుపై లంక విజ‌యం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఆఖ‌రిలో పెవిలియ‌న్‌కు వెలుతున్న వైభ‌వ్ సూర్య‌వంశీని లంక ఆట‌గాడు విషెన్ హ‌ల‌మ్‌బాగె రెచ్చ‌గొట్టాడు. దీంతో వైభ‌వ్ అత‌డి మీద‌కి దూసుకువెళ్లాడు. దీంతో అక్కడ ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ప‌క్క‌న ఉన్న ఆట‌గాళ్లు, అంపైర్లు వారిని విడ‌దీశారు. ఇద్ద‌రిపై అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. వైభ‌వ్, విషెన్‌ల‌కు మ్యాచ్ ఫీజులో చెరో 50 శాతం జరిమానా విధించారు.

లంక ఆట‌గాళ్లు అన్న మాట‌ల‌ను మ‌న‌సులో పెట్టుకున్న వైభ‌వ్.. ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌న‌దైన శైలిలో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడేశాడు.