IND vs AUS 5th T20 : ఐదో టీ20 మ్యాచులో ఆసీస్ పై భారత్ విజయం
India vs Australia 5th T20 : బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచులో టీమ్ఇండియా తలపడింది.
- Thota Vamshi Kumar
- Updated on- December 3, 2023 / 10:28 PM IST
IND vs AUS 5th T20
టీమ్ఇండియా గెలుపు
161 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది.
6 ఓవర్లకు ఆసీస్ స్కోరు 50/2
ఆసీస్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తి అయ్యింది. ఆరు ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 50/2. ఆరోన్ హార్డీ (2), బెన్ మెక్‌డెర్మాట్ (15) లు ఆడుతున్నారు.
ఆస్ట్రేలియా టార్గెట్.. 161
బ్యాటర్లు విఫలం కావడంలో ఐదో టీ20 మ్యాచులో ఆస్ట్రేలియా ముందు టీమ్ ఇండియా ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ( 53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (31), జితేశ్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (21) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డార్వాయిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
10 ఓవర్లకు భారత స్కోరు 61/4
భారత ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు పూర్తి అయ్యాయి. 10 ఓవర్లకు భారత స్కోరు 61/4. జితేశ్ శర్మ(5), శ్రేయస్ అయ్యర్ (11)లు ఆడుతున్నారు.
ఓపెనర్లు ఔట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు స్వల్ప వ్యవధిలో రెండు షాకులు తగిలాయి. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్(21) నాథన్ ఎల్లిస్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ కాగా, మరికాసేపటికే బెన్ డార్వాయిస్ బౌలింగ్‌లో బెహ్రెన్‌డార్ఫ్ క్యాచ్ అందుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్ (10) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 4.3వ ఓవర్లో 33 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
భారత తుది జట్టు : యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా తుది జట్టు : ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(కెప్టెన్), బెన్ డార్వాయిస్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ
టాస్..
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూవేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
India vs Australia 5th T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రమైన చివరి టీ20లోనూ విజయం సాధించి దక్షిణాఫ్రికా పర్యటనకు విజయంతో వెళ్లాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో ఐదో టీ20 మ్యాచులో తలపడుతోంది.
