IND vs ENG : ఇంగ్లాండ్‌తో తొలి వన్డే.. విజృంభించిన బౌలర్లు.. భారత లక్ష్యం ఎంతంటే?
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో (IND vs ENG) భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 14, 2026 / 07:25 PM IST
IND vs ENG 1st ODI Team india taret is 259 runs
IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్గాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 259 పరుగుల లక్ష్యం నిలిచింది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో జోరూట్ (76 నాటౌట్; 76 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), లియామ్ డాసన్ (68; 83 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. బెన్ డకెట్ (43; 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ లు చెరో రెండు వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబెలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Ryan ten Doeschate : ఇంగ్లాండ్ సిరీస్ తరువాత.. భారత అసిస్టెంట్ కోచ్ పదవికి డస్కటే రాజీనామా!
భారత బౌలర్ల ధాటికి ఓ దశలో ఇంగ్లాండ్ 107 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును జోరూట్, లియామ్ డాసన్‌లు ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచిన రూట్ జట్టు స్కోరును 250 పరుగులు దాటించాడు.
