IND vs ENG : కోహ్లీ, శ్రేయ‌స్ హాఫ్ సెంచ‌రీలు.. ఇంగ్లాండ్ ముందు ఓ మోస్త‌రు ల‌క్ష్యం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో (IND vs ENG) భార‌త బ్యాట‌ర్లు విఫ‌లం అయ్యారు.

IND vs ENG 2nd ODI Team India 233 all out england target is 234

IND vs ENG : మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు విఫ‌లం అయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 44 ఓవ‌ర్ల‌లో 233 ప‌రుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 234 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (65; 66 బంతుల్లో 8 ఫోర్లు), శ్రేయ‌స్ అయ్య‌ర్ (66; 71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. రోహిత్ శ‌ర్మ (26), శుభ్‌మ‌న్ గిల్ (31), జ‌స్‌ప్రీత్ బుమ్రా (13 బంతుల్లో 20 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించ‌గా ఇషాన్ కిష‌న్ (1), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (2), శివ‌మ్ దూబె (0), అక్ష‌ర్ ప‌టేల్ (1)లు విఫ‌లం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్,గస్ అట్కిన్సన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. సాకిబ్ మహమూద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సామ్ క‌ర‌న్‌, విల్ జాక్స్ లు చెరో వికెట్ సాధించారు.