IND vs ENG : విశాఖ వాసులకు శుభవార్త.. విద్యార్థులకు ఫ్రీ.. రెండో టెస్టు మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఎప్పుడంటే..?
చాలా రోజుల తరువాత నగరం ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
- Thota Vamshi Kumar
- Published On : January 11, 2024 / 07:26 PM IST
IND vs ENG 2nd test
India vs England : విశాఖ నగర వాసులకు శుభవార్త. చాలా రోజుల తరువాత నగరం ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. టీమ్ఇండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన తరువాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ విశాఖ వేదికగా జరగనుంది. దీంతో దాదాపు నాలుగేళ్ల తరువాత టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం విశాఖ వాసులకు కలుగనుంది.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు మ్యాచ్‌ను నిర్వహించారు. ఇప్పటికే మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లను విక్రయించనున్నారు. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో 26 నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆఫ్‌లైన్‌లో టికెట్లను ఏసీ ఏ విడిసిఏ స్టేడియంతో పాటు స్వర్ణ భారతి స్టేడియంలో విక్రయించనున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు 2వేల మంది విద్యార్థులకు మైదానంలోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
Team India : ప్రాక్టీస్‌కు వెళ్లిన టీమ్ఇండియా క్రికెటర్లకు ఊహించని పరిస్థితి..!
భారత్ vs ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జనవరి 25న జరగబోయే టెస్టుతో భారత్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ మొదలుకానుంది.
మొదటి టెస్టు – జనవరి 25 నుంచి 29 వరకు – ఉప్పల్
రెండో టెస్టు – ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు – విశాఖపట్నం
మూడో టెస్టు – ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు – రాజ్‌కోట్
నాలుగో టెస్టు – ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు – రాంచీ
ఐదో టెస్టు – మార్చి 7 నుంచి 11 వరకు – ధర్మశాల
