IND vs ENG : రేప‌టి నుంచే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభ‌వ్ అరంగ్రేటం చేసేనా? జోఫ్రాతోనే 15 ఏళ్ల బుడ్డోడికి ముప్పు?

భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య (IND vs ENG) బుధ‌వారం (జూలై 1) నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs ENG 5 match T20 Series from Tommorrow can jofra archer stop Vaibhav Sooryavanshi

  • బుధ‌వారం నుంచి భార‌త్, ఇంగ్లాండ్‌ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్‌
  • వైభ‌వ్ సూర్య‌వంశీ అరంగ్రేటం చేసేనా?

IND vs ENG : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఓట‌మి నుంచి భారత జ‌ట్టు ఇంకా తేరుకోలేదు. అయిన‌ప్ప‌టికి కూడా మ‌రో టీ20 సిరీస్‌కు రెడీ అయింది. అయితే.. ఈ సారి ప్ర‌త్య‌ర్థి చిన్న జ‌ట్టేమీ కాదు.. పొట్టి ఫార్మాట్‌లో భ‌యంక‌ర‌మైన ఇంగ్లాండ్ జ‌ట్టు. పైగా దాని స్వ‌దేశంలో ఇంగ్లీష్ జ‌ట్టును ఎదుర్కొన‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ప‌సికూన ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌ను ఏ మేర‌కు అడ్డుకుంటుంది అన్నది సగ‌టు క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

వైభ‌వ్ సూర్య‌వంశీ అరంగ్రేటం చేసేనా?

ఐపీఎల్ 2026తో పాటు శ్రీలంక‌లో భార‌త్‌-ఏ త‌రుపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అరంగ్రేటం చేస్తాడ‌ని అంతా భావించారు. అయితే.. టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం ఆ ఛాన్స్ వైభ‌వ్‌కు ఇవ్వ‌లేదు. రెండు మ్యాచ్‌ల్లో క‌నీసం ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించ‌లేదు. దీంతో చాలా మంది అభిమానులు నిరుత్సాహ‌నికి గురైయ్యారు. అదే స‌మ‌యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

Asian Games 2026 : ఆసియా గేమ్స్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇదే.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నాయ‌క‌త్వంలోనే..

ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్‌పై వైభ‌వ్‌ను ఆడించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బుధ‌వారం (జూలై 1న‌) జ‌రిగే తొలి టీ20 మ్యాచ్‌లోనే వైభ‌వ్ అరంగ్రేటం చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఐర్లాండ్ సిరీస్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన సంజూ శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని బెంచ్‌కే ప‌రిమితం చేసి వైభ‌వ్ కు చోటు ఇస్తార‌ని అంటున్నారు.

జోఫ్రాతో వైభ‌వ్‌కు ముప్పే?

ఐపీఎల్‌2026లో ప్ర‌పంచ స్థాయి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన వైభ‌వ్ సూర్య‌వంశీ బౌల‌ర్ల‌కు స్వ‌ర్గ‌ధామం అయిన ఇంగ్లాండ్ పిచ్‌ల‌పైన ఎలా ఆడ‌తాడో అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ జ‌ట్టు స్టార్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో వైభ‌వ్ జాగ్ర‌త్త‌గా ఆడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీరిద్ద‌రు ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు క‌లిసి ఆడారు. ఈ క్ర‌మంలో వైభ‌వ్ బ‌ల‌హీన‌త‌ల‌పై ఆర్చ‌ర్‌కు ఓ అంచ‌నా ఉండే ఉంటుంది.

ఇక ఐపీఎల్‌లో ఓ స‌మ‌యంలో వైభ‌వ్‌ను ఎలా క‌ట్ట‌డి చేయాలో త‌న‌కు తెలుసున‌ని, ఐపీఎల్ ముగిసిన త‌రువాత దాని గురించి వెల్ల‌డిస్తాన‌ని ఆర్చ‌ర్ చెప్పిన సంగ‌తి మ‌రిచిపోవ‌ద్దు.