Stokes-Archer : జోఫ్రా ఆర్చర్‌పై బెన్‌స్టోక్స్ ఆగ్రహం.. కారణం ఇదే.. కోపంతో బౌండరీ లైన్ వద్దే ఉండిపోయాడు! వీడియో వైరల్..
Stokes-Archer : ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
Stokes-Archer
Stokes-Archer : ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహచర ఆటగాడు జోఫ్రా ఆర్చర్ పై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు భారీ ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు 114.5 ఓవర్లలో 438 పరుగులు చేసింది. ఆ తరువాత ఇంగ్లాండ్ 88.2 ఓవర్లలో 354 పరుగులకే ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్‌లో 84 పరుగుల ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఇదిలాఉంటే.. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 114వ ఓవర్ ను షోయబ్ బషీర్ వేయగా.. కివీస్ బ్యాటర్ నాథన్ స్మిత్ ఔట్ అయ్యాడు. ఆ సమయంలో అందరూ బషీర్ వద్దకు వచ్చి అభినందించారు. కానీ, జోఫ్రా ఆర్చర్ మాత్రం బౌండరీ లైన్ వద్దనే ఉండిపోయాడు. దీంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ పెద్దగా ఆర్చర్ ను పిలుస్తూ వికెట్ తీసిన బౌలర్ ను అభినందించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆర్చర్ బౌండరీ లైన్ వద్ద నుంచి వచ్చి బషీర్ ను అభినందించాడు.
జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసిన బషీర్‌ను అభినందించడానికి రాకపోవడానికి కారణం ఉందట. అంతకుముందు ఆర్చర్ వేసిన ఓవర్లో టామ్ బ్లండెల్ ఇచ్చిన క్యాచ్‌ను షోయబ్ బషీర్ జారవిడ్చాడు. దీంతో ఆర్చర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ కారణంగానే బషీర్ వికెట్ పడగొట్టినా అభినందించేందుకు రాకుండా బౌండరీ వద్దనే వేచి ఉన్నాడు. దీన్ని గమనించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ అర్చర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతను వచ్చి బషీర్ ను అభినందించాడు. అయితే, కెప్టెన్ స్టోక్స్ ఆర్చర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
🚨Ben Stokes had some words for Jofra Archer after the pacer initially didn’t join in the celebrations following Shoaib Bashir’s caught and bowled. Bashir had dropped a catch off Archer’s bowling the over before pic.twitter.com/7FiKNzQdKV
— SheR•ALI (@Sher__Ali) June 27, 2026
