Redmi 17 4G Launch : రెడ్మి 17లో భారీ అప్గ్రేడ్లు.. లాంచ్‌కు ముందే ఫుల్ స్పెసిఫికేషన్లు లీక్!
Redmi 17 4G Launch : రెడ్మి నుంచి అద్భుతమైన 4జీ ఫోన్ వస్తోంది. 7,500mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది. ఈ ఫోన్ ఫుల్ ఫీచర్లు, స్పెషిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి..

Redmi 17 4G Launch : రెడ్మి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కంపెనీ రెడ్మి 17 4జీ అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. రాబోయే రెడ్మి 17 4జీ ఫోన్ ఇటీవలే EPREL లిస్టింగ్‌లో కనిపించింది. బ్యాటరీకి సంబంధించి వివరాలు కూడా రివీల్ అయ్యాయి. గతంలో అనేక సర్టిఫికేషన్ లిస్టింగ్‌లు స్నాప్‌డ్రాగన్ 6s 4G జెన్ 2 ప్రాసెసర్‌ను సూచించాయి. అయితే, కొత్త లీక్ నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ 12nm మీడియాటెక్ హీలియో G91-అల్ట్రాతో లిస్టు అయింది.

రెడ్మి 17 4జీ స్పెసిఫికేషన్లు :
ఈ రెడ్మి 17 4జీలో 1600 × 720 రిజల్యూషన్‌తో 6.9-అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందని అంచనా. కీలక డిస్ప్లే ఫీచర్లలో 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 675 నిట్స్ సాధారణ బ్రైట్నెస్ (హై బ్రైట్నెస్ మోడ్‌లో 825 నిట్స్ వరకు), 8-బిట్ కలర్ డెప్త్, 83శాతం NTSC కలర్ గామట్ కవరేజ్, డీసీ డిమ్మింగ్ వంటివి ఉండవచ్చు.

డిజైన్‌లో డైనమిక్ RGB లైటింగ్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి అంశాలు ఉన్నాయి. గత వారం లాంచ్ అయిన రెండర్లలో కనిపించాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఓక్ గ్రీన్, డీప్ బ్లూ, బ్లాక్, లోటస్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభ్యం కావచ్చు. ఈ ఫోన్ కొలతలు 170.12 × 78.42 × 8.8 మిమీ, బరువు 232 గ్రాములు, IP64 రేటింగ్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50MP మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా ఉండొచ్చు. ఈ ఫోన్ 7,500mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది.

ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC సపోర్ట్ ఉంటాయని భావిస్తున్నారు. మెమరీ ఆప్షన్లలో 4GB/128GB, 4GB/256GB, 6GB/128GB, 6GB/256GB కాన్ఫిగరేషన్లు ఉండవచ్చు. HyperOS 3, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, NFC వంటి ఫీచర్లు ఉండొచ్చు.

రెడ్మి 17 ధర (అంచనా) :
రెడ్మి నుంచి రాబోతున్న ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ 4జీ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 6GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అందిస్తుంది. ప్రారంభ ధర ఈయూఆర్ 250 (సుమారుగా రూ. 28వేలు) ఉండొచ్చు. కాగా, టాప్-ఎండ్ వేరియంట్ ధర ఈయూఆర్ 280 (సుమారుగా రూ. 31వేలు) ఉండవచ్చు. లీక్ రెండర్ల ప్రకారం.. ఈ ఫోన్ డీప్ బ్లూ, బ్లాక్, ఓక్ గ్రీన్, లోటస్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

రెడ్మి 17c ఫీచర్లు :
ఈ రెడ్మి ఫోన్ ఇప్పటికే మార్కెట్లో లాంచ్ కాగా 6.88-అంగుళాల HD+ డిస్ప్లేతో అందుబాటులో ఉంటుంది. మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా చిప్సెట్తో రన్ అవుతుంది. 4జీబీ వరకు ర్యామ్, 128GB స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13ఎంపీ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ, 4జీబీ ర్యామ్ + 128జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.
