Bigg Boss Telugu 10 : ఈ వారం ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. ? గొడవలు అరుపులు..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో (Bigg Boss Telugu 10) ఈ వారం ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
Bigg Boss Telugu 10 Fifth week Apoorva Eliminated
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 అప్పుడే ఐదో వారం చివరికి వచ్చేసింది. ఇక నేడు (ఆదివారం ) ఎవరు ఎలిమినేట్ కానున్నరనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ వర్షిణి, వంశీ, సుధీర్ మినహా మిగిలిన కంటెస్టెంట్లంతా ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన రోడ్ టూ రీలోడ్ టాస్క్‌లో కొందరు సేవ్ కాగా.. చివరికి రోహిత్, షాలిని, అపూర్వ, చరణ్, నరేశ్ మిగిలారు.
వీరిలో రోహిత్ ఓటింగ్ పరంగా దూసుకువెలుతున్నాడు. తన కామెడీతో మంచి ఎంటర్టైన్ చేస్తున్న నరేశ్‌కు సైతం మంచి ఓటింగ్ పడుతోంది. అపూర్వ మొన్ననే వచ్చిందని, షాలినీ, చరణ్‌లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా భావిస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అపూర్వ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu : మహేష్, సుక్కు కాంబో సెట్టా.?
మూడు వారాల క్రితం మరో కంటెస్టెంట్ మిథిలేశ్‌తో కలిసి అపూర్వ హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మిథిలేష్ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌తో బయటికి వచ్చేశాడు. మరోవైపు అపూర్వ రాగానే కెప్టెన్ అయినప్పటికి.. ఆట, టాస్కుల మీద ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఎక్కువగా అరుపులు, వాగ్వాదాలు , ఓవర్ యాక్షన్‌తోనే హైలెట్ అయింది. దీంతో ఓటీంగ్లో అనుకున్న స్థాయిలో ఆమెకు ఓట్లు పడలేదని సమాచారం. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అపూర్వతో పాటు షాలినీ కూడా హౌస్ నుంచి బయటకు రావొచ్చునని అంటున్నారు. ఇక ఈ వారంలో ఐదుగురు.. శివ కుమార్, సాక్షి నాయుడు, డాక్షి గుత్తికొండ, నీతూ నటరాజ్, రామకృష్ణ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
