Sanju Samson : వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..
వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు భారత స్టార్ ఆటగాడు సంజూ శాంసన్‌ను (Sanju Samson) ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
IND vs WI 3rd T20 in indore Sanju Samson Need 2 More To Complete 100 Sixes In International T20is
Sanju Samson : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (అక్టోబర్ 11) ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత స్టార్ ఆటగాడు సంజూ శాంసన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కనున్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు ఉన్న క్లబ్లో సంజూ చేరనున్నాడు. వీరిలో రోహిత్ శర్మ ఒక్కడే 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు.
Saaniya tendulkar : సచిన్ కోడలు.. సానియా టెండూల్కర్ గోవా డైరీస్ ఫోటోలు.. వైరల్..
ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే.. 2015లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 27.2 సగటుతో 1660 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 9 అర్థశతకాలు ఉన్నాయి. 142 ఫోర్లు, 98 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 64 మ్యాచ్‌ల్లో 136 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 74 మ్యాచ్‌ల్లో 98 సిక్సర్లు
