IND vs ZIM : మూడో టీ20లో భారత్ ఘన విజయం.. జింబాబ్వేతో సిరీస్ క్లీన్ స్వీప్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో (IND vs ZIM ) భారత్ 35 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
India beat Zimbabwe in 3rd T20 match and series clean sweep
IND vs ZIM : హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్లీప్ చేసింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు తొలి టీ20 సిరీస్ ను సాధించింది.
193 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్ (54 నాటౌట్; 43 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే రాణించారు. మిగిలిన వారిలో వెస్లీ మధెవెరే (28), బెన్ కర్రాన్ (20)లు పర్వాలేదనిపించారు. టీమ్ఇండియా బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు తీయగా యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అశోక్ శర్మ లు చెరో వికెట్ సాధించారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (81; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ (29; 26 బంతుల్లో 4 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (27; 18 బంతుల్లో 2 ఫోర్లు), రింకూ సింగ్ (25; 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు వికెట్లు తీయగా.. సికిందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబాని, వెస్లీ మధెవెరే లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
