Abhishek Sharma : ముచ్చటగా మూడో టీ20మ్యాచ్‌లోనూ విఫలం.. అభిషేక్ ఏంది ఇది? నీకన్నా బుడ్డోడే నయం..
జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma )ఘోరంగా విఫలం అయ్యాడు.
IND vs ZIM 3rd T20 Once again Abhishek Sharma fail
Abhishek Sharma : జింబాబ్వే పర్యటనలో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలం అయ్యాడు. ముచ్చటగా మూడో టీ20 మ్యాచ్‌లోనూ అతడు రెండు అంకెల స్కోరును సాధించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి అతడు 11 పరుగులు మాత్రమే సాధించాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో 8 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన అభిషేక్.. రెండో టీ20 మ్యాచ్‌లో 8 బంతుల్లో 8 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2.5 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఇక ముచ్చటగా మూడో టీ20 మ్యాచ్‌లో 4 బంతుల్లో 2 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లోనే ఔట్ కావడం గమనార్హం.
𝐁𝐥𝐞𝐬𝐬𝐢𝐧𝐠 has been a curse for Abhishek Sharma 🤕
Watch it LIVE on FanCode! 🇮🇳 👇https://t.co/eIbqNipOAB#ZIMvIND #IndiaCricket #RokoNahiThoko pic.twitter.com/HY4efBojw2
— FanCode (@FanCode) July 26, 2026
దీంతో అభిషేక్ శర్మ పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
