IND vs ENG : పిచ్ పేస్‌కు అనుకూలమా? స్పిన్‌కా అన్నది అనవసరం.. ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ప్రకటన
ఇప్పటికే సిరీస్ ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : March 6, 2024 / 04:12 PM IST
England announces playing XI for fifth Test against India
IND vs ENG 5th Test : ఇప్పటికే సిరీస్ ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనను విజయంతో ముగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం నుంచి ఆరంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌కు తుది జట్టును ప్రకటించింది. కేవలం ఒకే ఒక మార్పు చేసింది. నాలుగో టెస్టులో ఆడిన రాబిన్సన్ పై వేటు వేసింది. అతడి స్థానంలో మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.
కాగా.. ధర్మశాల పిచ్ పేస్ అనుకూలిస్తుందా, స్పిన్‌కు అనుకూలిస్తుందా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్ పేసర్లకు అనుకూలం అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగొచ్చని అంతా భావించారు. అయితే.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే ఆడనుంది. జిమ్మీ అండర్సన్, మార్క్‌వుడ్ లు పేసర్లు కాగా.. టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ లు స్పిన్నర్లు.
ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్న జానీ బెయిర్ స్టో పై జట్టు మేనేజ్మెంట్ నమ్మకం ఉంచింది. అతడికి మరో అవకాశం ఇచ్చింది. కాగా.. అతడికి ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక సిరీస్ విషయానికి వస్తే.. భారత్ ప్రస్తుతం 3-1 ఆధిక్యంలో ఉంది.
ధర్మశాల టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్
సస్పెన్స్ వీడింది.. ధోని కొత్త పాత్ర ఏంటో తెలిసిపోయింది.. ద్విపాత్రాభినయం
We make one change for the final match of the series ?
?? #INDvENG ??????? | #EnglandCricket
— England Cricket (@englandcricket) March 6, 2024
