Gautam Gambhir : మీకు చెప్పాల్సిన పని లేదు.. సంజూకు చెప్పా స‌రిపోతుంది.. గంభీర్ హాట్ కామెంట్స్ వైర‌ల్‌..

సంజూ శాంస‌న్‌ను జ‌ట్టులోంచి త‌ప్పించ‌డంపై ఎట్ట‌కేల‌కు గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు.

IND vs ENG Gautam Gambhir key comments on dropping Sanju Samson

  • సంజూ శాంస‌న్‌ను త‌ప్పించ‌డం పై ఎట్ట‌కేల‌కు స్పందించిన హెడ్ కోచ్ గంభీర్
  • దాని గురించి సంజూకు ఎప్పుడో స్ప‌ష్ట‌త ఇచ్చా
  • మీకు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు

Gautam Gambhir : ట్రెంట్ బ్రిడ్జ్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 202 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కేవ‌లం 76 ప‌రుగుల‌కే టీమ్ఇండియా కుప్ప‌కూలింది. దీంతో ఇంగ్లాండ్ 125 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ప్ర‌పంచ క‌ప్ హీరో సంజూ శాంస‌న్‌ను ప‌క్క‌న బెట్ట‌డంపై హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శల జ‌డివాన కొన‌సాగుతోంది.

వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో విఫ‌లం కావ‌డంతో సంజూ శాంస‌న్‌ను భార‌త జ‌ట్టు మేనేజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టింది. అంతేకాదండోయ్‌..జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేయ‌లేదు. దీనిపై ఎట్ట‌కేల‌కు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భార‌త్ ఓడిన త‌రువాత మీడియా స‌మావేశంలో మాట్లాడాడు.

ఎందుకు జ‌ట్టులోంచి తీసివేశామ‌నే విష‌యంపై త‌న‌కు, సంజూ శాంస‌న్‌కు మ‌ధ్య పూర్తి స్ప‌ష్ట‌త ఉంద‌న్నాడు. అయితే.. ఆ విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌ద‌ల‌చుకోలేద‌న్నాడు. ‘ఎందుకు తీసివేశాం అన్న దానిపైనే నా వైపు నుంచి సంజూ శాంస‌న్‌కు స్ప‌ష్ట‌త ఇచ్చాను. హెడ్ కోచ్‌, ప్లేయ‌ర్‌కు మ‌ధ్య జ‌రిగిన సంబాష‌ణ అది. ఆ సంభాష‌ణ వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని అనుకోవ‌డం లేదు. ‘అని గంభీర్ చెప్పాడు.

సంజూ శాంస‌న్ విష‌యంలో తాము పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్నామ‌న్నాడు. అత‌డు టీమ్ఇండియా కోసం చేసిన దేనిని తాము మ‌రిచిపోలేద‌ని అన్నాడు. అయితే.. ఏదైన సిరీస్‌కు ఎంపిక చేసేట‌ప్పుడు ప్లేయ‌ర్ ప్ర‌స్తుత ఫామ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌న్నాడు. సంజూ మ‌ళ్లీ పుంజుకుని ఇదే సిరీస్‌లో పున‌రాగ‌మ‌నం చేయొచ్చున‌ని తెలిపాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు అత‌డు ఇబ్బంది ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని గుర్తు చేసుకున్నాడు. అయితే.. వ‌రల్డ్ క‌ప్‌లో అద్భుత‌మైన ఆటతీరుతో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు.

అందుకే ఓడిపోయాం..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఫ‌లితాలే ముఖ్య‌మ‌న్నాడు. జ‌ట్టు కూర్పు కాద‌న్నాడు. గెలిచేందుకు ఏ కాంబినేష‌న్ స‌రైంద‌ని భావిస్తామో అలాంటి తుది జ‌ట్టునే ఎంపిక చేస్తామ‌ని చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ స్థానాన్ని, భారతదేశం తరపున ఆడే హక్కును సంపాదించుకోవాలని నేను ఎల్లప్పుడూ గట్టిగా నమ్ముతాను అని గంభీర్ అన్నాడు.

పరిస్థితికి అనుగుణంగా మారే సామర్థ్యం విషయానికి వస్తే.. స్పష్టంగా మేము సరిగ్గా అలవాటు పడలేదు. ఐర్లాండ్ అయినా, ఇంగ్లాండ్ అయినా ఇదే వాస్తవం. ఒకవేళ మేము సరిగ్గా అలవాటు పడినా లేదా మెరుగైన క్రికెట్ ఆడినా, బహుశా వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయేవాళ్ళం కాదు అని గంభీర్ చెప్పుకొచ్చాడు.