IND vs NZ : న్యూజిలాండ్‌తో భారత్ తొలి టీ20 మ్యాచ్.. భువీ, తిలక్, కుల్దీప్ యాదవ్‌లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- October 22, 2026 / 09:32 AM IST
IND vs NZ 1st T20 match Tilak Varma Kuldeep Yadav and Bhuvneshwar Kumar eye on huge milestones
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో బోణీ కొట్టాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతుండగా, మిచెల్ సాంట్నర్ సారథ్యంలో కివీస్ ఆడనుంది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్‌లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
కుల్దీప్ యాదవ్..
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 వికెట్ల క్లబ్లో అడుగుపెడతాడు. ఈ ఘనత అత్యంత వేగంగా సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు అర్ష్‌దీప్ సింగ్ పేరిట ఉంది. అతడు 64 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీశాడు.
ఇక కుల్దీప్ విషయానికి వస్తే.. 2017లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 98 వికెట్లు పడగొట్టాడు.
తిలక్ వర్మ..
ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ ఏడు సిక్సర్లు సాధిస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌లు మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరుపున 100 సిక్సర్లు బాదారు.
IND vs NZ : భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ నేడే.. జియోలో రాదు.. ఎక్కడ చూడొచ్చంటే?
2023లో అంతర్జాతీయ టీ20క్రికెట్లో అరంగ్రేటం చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకు 70 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 93 సిక్సర్లు కొట్టాడు.
భువనేశ్వర్ కుమార్..
నాలుగేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న భువనేశ్వర్ కుమార్ పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఈ సిరీస్‌లో అతడు 10 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. 2012లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అడుగుపెట్టిన భువీ.. ఇప్పటి వరకు 88 టీ20 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు సాధించాడు.
