Shreyas Iyer : న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు.. ఇప్పట్లో వైభవ్‌కు తుది జట్టులో చోటు ఇవ్వం..
న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక వ్యాఖ్యలు చేశాడు.
Shreyas Iyer key comments on Vaibhav Sooryavanshi ahead of IND vs NZ 1st T20 macth
Shreyas Iyer : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం (అక్టోబర్ 22) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు రోజు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో ఇప్పుడప్పుడే అవకాశం రావడం కష్టం అని చెప్పుకొచ్చాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నారని స్పష్టం చేశాడు. వైభవ్‌కు తగిన సమయంలో అవకాశాలు వస్తాయని పేర్కొన్నాడు.
ఈ ఏడాది ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టులో ఎంపికైనప్పటి నుంచి వైభవ్ ఇప్పటివరకు భారత్ ఆడిన 21 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కేవలం ఎనిమిదింటిలో ఆడాడు. ఓపెనర్లుగా అభిషేక్, సంజూ అద్భుతంగా రాణిస్తుండటంతో అతడికి తుది జట్టులో అవకాశాలు పరిమితమయ్యాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ నిలబెట్టుకోవడంలోనూ వీరిద్దరూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
వైభవ్‌కు ఇప్పట్లో చోటు కష్టం
‘వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడు జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ సంతోషంగా ఉండటం ముఖ్యం. అతడు చాలా చిన్న వయసులో ఉన్నాడు. భవిష్యత్తులో అతడికి ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం మా ఓపెనర్లు నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. ప్రపంచకప్‌ను కూడా గెలిపించారు. అందుకే వైభవ్ ఇప్పుడే తుది జట్టులోకి వచ్చి ఆడలేడు. తుది జట్టులో స్థానం లేకపోయినప్పటికి కూడా విదేశీ పర్యటనల ద్వారా ఇక్కడి పిచ్‌లపై ఎలా ఆడాలో వైభవ్‌కు అవగాహన వస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఆడేందుకు వచ్చినప్పుడు అతడు మెరుగ్గా సిద్ధమై ఉంటాడు. తొలిసారి ఇక్కడికి వచ్చే ఇతర ఆటగాళ్లకు కూడా తన అనుభవంతో సూచనలు ఇవ్వగలడు.’ అని శ్రేయస్ తెలిపాడు.
ఇక వరుసగా మ్యాచ్‌లు ఆడడం పై మాట్లాడుతూ.. వరుసగా మ్యాచ్‌లు ఆడుతుండడంతో ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఉండడం లేదన్నాడు. అయితే.. ఆ కారణాలు అన్నింటిని పక్కన పెట్టి కేవలం విజయం పై మాత్రమే దృష్టి పెడతామన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇదే విషయం పై చర్చించుకున్నట్లు తెలిపాడు.
ఇక కివీస్‌లో పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలంగా ఉంటాయన్నాడు. ఇంగ్లాండ్‌లో, న్యూజిలాండ్‌లో పరిస్థితులు పెద్దగా భిన్నంగా ఉంటాయని తాను అనుకోవడం లేదన్నాడు. మ్యాచ్ రోజు పిచ్ ఎలా స్పందిస్తుంది అనేది ఎవరికి తెలియదన్నాడు. జట్టు నిలకడగా ఆడుతోందని, వీలైనంత త్వరగా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడాలని సూచించాడు.
జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లు తమ బ్యాటింగ్ స్థానాల్లో మార్పులకు సిద్ధంగా ఉండాలి. మ్యాచ్ పరిస్థితిని బట్టి నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలను. గత టీ20 ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ నిలకడగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకే నేను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు అని అయ్యర్ అన్నాడు.
