Rag Mayur : గరివిడి లక్ష్మిలో డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టిన రాగ్ మయూర్
‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో సత్తిబాబు పాత్రతో రాగ్ మయూర్ (Rag Mayur) అద్భుతంగా నటించారు.
Rag Mayur stunning performance in Garividi Laxmi movie
Rag Mayur : విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే నటనలో వైవిధ్యం చూపించడం ఎంతో ముఖ్యం. కేవలం లుక్స్, స్టైల్‌తోనే కాకుండా పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ నటించే వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో సత్తిబాబు పాత్రతో రాగ్ మయూర్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే పాత్రలో ఐదు విభిన్న ఛాయలను ఆవిష్కరిస్తూ, తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో రాగ్ మయార్ పెర్ఫార్మెన్స్పై ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతోంది.
సత్తిబాబు పాత్రలో ఐదు విభిన్న షేడ్స్‌ను చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కో దశలో పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, హావభావాలు, మాటతీరు, భావోద్వేగాలను మార్చుకోవడం నటుడికి సవాలుతో కూడుకున్న అంశం. కేవలం గెటప్పులు మార్చుకోవడం కాకుండా, ప్రతి షేడ్లోనూ ప్రత్యేకతను చూపిస్తూ పాత్రలో సహజత్వాన్ని నిలబెట్టడం కీలకం. ఈ విషయంలో రాగ్ మయూర్ చేసిన ప్రయత్నం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Divi : అయోధ్యలో నటి దివి.. ఫోటోలు వైరల్..

ముఖ్యంగా వయసుకు తగ్గట్టుగా శరీర భాషను మార్చుకోవడం, నడకలో వేగం నుంచి మాటతీరులోని మార్పుల వరకు పాత్రకు అనుగుణంగా నటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీకాకుళం యాసలో డైలాగ్ డెలివరీ కూడా సత్తిబాబు పాత్రకు ప్రత్యేకతను తీసుకొస్తోంది. ఒకే నటుడిలో భిన్నమైన వ్యక్తిత్వాలను ప్రేక్షకులు గుర్తించేలా చేయడం ఈ పాత్రలో ప్రధాన సవాల్‌గా నిలుస్తోంది.
రాగ్ మయూర్ నటనను పరిశీలిస్తే రవితేజ ఎనర్జీ, కమల్ హాసన్ నటనా వైవిధ్యం గుర్తుకు వస్తున్నాయనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది.
