IND vs NZ : దంచికొట్టిన గ్లెన్ ఫిలిప్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
IND vs NZ : క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
- Thota Vamshi Kumar
- Updated on- October 22, 2026 / 02:41 PM IST
IND vs NZ 1st T20 Team india Target is 226
IND vs NZ : క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 226 పరుగుల లక్ష్యం నిలిచింది.
కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (82 నాటౌట్; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఫిల్ అలెన్ (45; 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బెవాన్ జాకబ్స్ (31; 16 బంతుల్లో 3 సిక్సర్లు) వేగంగా ఆడారు. టిమ్ సీఫెర్ట్ (27; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డారిల్ మిచెల్ (28; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
