IND vs NZ 2nd T20 : నేడు భార‌త్‌ vs న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌.. జియో హాట్‌స్టార్‌లో రాదు.. మ‌రీ ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

IND vs NZ 2nd T20 Match : భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం ఐదు టీ20 సిరీస్ జరుగుతుంది. ఇక ఈ సిరీస్ ప్ర‌సార హ‌క్కుల‌ను సోనీ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది.

IND vs NZ 2nd T20

IND vs NZ 2nd T20 Match : భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ పూర్తికాగా.. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. క్రెస్ట్‌చర్చ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో భారత జట్టు ఉంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ టీ20 సిరీస్ జియో హాట్ స్టార్‌లో‌రాదు.. సోనీ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.

Also Read : Amit Mishra : విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేపై టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన కామెంట్స్

ఎక్క‌డ చూడొచ్చంటే?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇక ఈ సిరీస్ ప్ర‌సార హ‌క్కుల‌ను సోనీ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది. ఈ క్ర‌మంలో టీవీల్లో మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్‌లో ప్ర‌సారం కానున్నాయి. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే.. సోనీ లివ్ యాప్‌, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక మ్యాచ్‌లు అన్నీ కూడా భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం 12.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.

వైభవ్‌కు చోటు..
న్యూజిలాండ్ పర్యటనను విజయంతో మొదలు పెట్టిన టీమిండియా ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆతిథ్య జట్టుకు షాకిచ్చిన భారత్.. ఆత్మవిశ్వాసంతో రెండో టీ20కి సిద్ధమైంది. ఇషాన్ కిషన్ గాయపడడంతో ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. అయితే, తొలి మ్యాచ్‌లో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు క్రీజులోకి వచ్చారు. ఇషాన్ ప్లేస్‌లో తుది జట్టులోకి వస్తున్న వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఓపెనర్ గా బరిలోకిదిగే అవకాశం ఉంది. సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

భారత్ జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, సమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్.
న్యూజిలాండ్ జట్టు (అంచనా) : అలెన్, సీఫర్ట్, ఫిలిప్స్, మిచెల్, జాకబ్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, నాథన్ స్మిత్, హెన్రీ, మిల్నే, ఫెర్గూసన్.