IND vs NZ : టాస్ గెలిచిన భార‌త్.. కివీస్ బ్యాటింగ్.. తుది జ‌ట్టులో మూడు మార్పులు..

IND vs NZ : వెల్లింగ్ట‌న్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND vs NZ 3rd T20 Team India opt to bowl

IND vs NZ : వెల్లింగ్ట‌న్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భార‌త్ ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి సిరీస్‌ను ఇక్క‌డే సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంది. మ‌రోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజ‌యం సాధించి భార‌త ఆధిక్యాన్ని త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప‌ట్టుదల‌గా ఉంది.

Tilak Varma : న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌.. తిల‌క్ వ‌ర్మ‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి..

‘ముందుగా మేము బౌలింగ్ చేస్తాం. మేము కొన్ని అంశాలలో మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మైదానాల కొలతలు, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, కాబట్టి మేము ఎంత త్వరగా అలవాటుపడితే మాకు అంత మంచిది. తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు. గ‌త మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టునే కొన‌సాగిస్తున్నాము. ‘అని శ్రేయ‌స్ అయ్య‌ర్ అన్నాడు.

‘చూస్తుంటే ఈ పిచ్ చాలా మంచి వికెట్‌లాగా కనిపిస్తోంది. కొంత బౌన్స్‌, వేగం ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతానికి బ‌ల‌మైన గాలులు లేవు. ఇంతకు ముందు ఆడిన మైదానాలతో పోలిస్తే.. ఇక్కడి మైదాన కొలతలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. భారత్ ఒక బలమైన జట్టు అని మనకు తెలుసు, కాబట్టి ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదు. తుది జ‌ట్టులో మూడు మార్పులు ఉన్నాయి. మాట్ హెన్రీ, లాకీ, స్మిత్ స్థానాల్లో ఫిషర్, జేమీసన్, మిల్నే వచ్చారు. ‘అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్న‌ర్ తెలిపాడు.

న్యూజిలాండ్ తుది జ‌ట్టు..

టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్.

భార‌త తుది జ‌ట్టు..

సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.