IND vs NZ : వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. అలా జరిగితే మాత్రం పెద్ద ఊరట లభించినట్లే..

Vaibhav Sooryavanshi : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే నాల్గో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా అనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతుంది.

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ న్యూజిలాండ్ వేదికగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మూడింటిలో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. సిరీస్ క్లీన్ స్వీప్‌పై భారత జట్టు గురిపెట్టింది. అయితే, నాల్గో టీ20 మ్యాచ్ వేళ వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read : INDW vs ZIMW 3rd ODI : వైష్ణవి శర్మ స్పిన్ మ్యాజిక్.. 17 ఓవర్లలోనే భారత్ విజయం.. స్మృతి మంధానకు అదిరిపోయే ఆరంభం..

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఆడాడు. ఆ సమయంలో అతనికి గాయం కావడంతో.. రెండు, మూడు టీ20 మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ స్థానంలో యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కింది. అయితే, రెండో టీ20 మ్యాచ్‌లో మూడో స్థానంలో క్రీజులోకి వచ్చి కేవలం నాలుగు పరుగులకే ఔట్ అయ్యి నిరాశ‌పర్చిన వైభవ్.. మూడో టీ20 మ్యాచ్‌లో ఓపెనర్ గా క్రీజులోకి వచ్చి 19బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో టీ20 మ్యాచ్ సందర్భంగా ఇషాన్ కిషన్ తుది జట్టులో చేరే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ మళ్లీ బెంచ్ కే పరిమితం అయ్యే సూచనలు ఉన్నాయి.

ఇప్పటికే సిరీస్ దక్కడంతో యంగ్ స్టార్ వైభవ్‌ను కొనసాగించాలనుకుంటే.. సీనియర్ కీపర్ సంజు శాంసన్‌కు విశ్రాంతినిచ్చే ఆలోచన కూడా యాజమాన్యం చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరికీ తుది జట్టులో అవకాశం దక్కుతుంది. అలా జరిగితే వైభవ్ కు పెద్ద ఊరట లభించినట్లేనని చెప్పొచ్చు.

జట్టులో మిగతా బ్యాటర్ల స్థానాలను కదిలించే పరిస్థితి లేకపోవడంతో చివరి రెండు టీ20లకు సంజూకు విశ్రాంతి కల్పించవచ్చునని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకోవడం వైభవ్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.

నాలుగో టీ20 ఆడే టీమిండియా తుది జట్టు..
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.