Ishan Kishan : టీ20 క్రికెట్లో ఇషాన్ కిషన్ మరో మైలురాయి.. హార్దిక్ పాండ్యా రికార్డు బ్రేక్..
Ishan Kishan : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- November 1, 2026 / 01:53 PM IST
IND vs NZ 5th T20 Ishan Kishan complete 2000 international T20 runs
Ishan Kishan : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 45 పరుగుల వద్ద అతడు ఈ ఘనత సాధించాడు.
అంతేకాదండోయ్ భారత్ తరుపున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మూడో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు.
Glenn Phillips : భారత్‌తో ఐదో టీ20 మ్యాచ్.. ప్రపంచ రికార్డు పై గ్లెన్ ఫిలిప్స్ కన్ను..
టీమ్ఇండియా తరుపున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. 1024 బంతుల్లో అభిషేక్ శర్మ 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరువాత రెండో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అతడు 1164 బంతుల్లో ఈ ఘనత సాధించగా ఇషాన్ కిషన్ 1345 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరుపున అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్లు వీరే..
* అభిషేక్ శర్మ – 1024 బంతుల్లో
* సూర్యకుమార్ యాదవ్ – 1164 బంతుల్లో
* ఇషాన్ కిషన్ – 1345 బంతుల్లో
* హార్దిక్ పాండ్యా – 1390 బంతుల్లో
ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 32 బంతులు ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు.
