Tilak Varma : ఆదివారం భారత్ vs న్యూజిలాండ్ ఐదో టీ20 మ్యాచ్.. భారీ రికార్డుపై తిలక్ వర్మ కన్ను..
న్యూజిలాండ్తో ఐదో టీ20 మ్యాచ్కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మను (Tilak Varma) ఓ మైలురాయి ఊరిస్తోంది.
IND vs NZ 5th T20 Tilak Varma Need 3 More To Complete 100 Sixes In International T20s
Tilak Varma : హామిల్టన్ వేదికగా ఆదివారం (నవంబర్ 1) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో గనుక తిలక్ 3 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన ఏడో భారత ప్లేయర్గా రికార్డులకు ఎక్కుతాడు.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ లు మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు బాదారు. వీరిలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ మాత్రమే 200 సిక్సర్లు కొట్టాడు.
New Zealand A vs India A : జైస్వాల్, స్మరణ్ డకౌట్.. దంచికొట్టిన సుదర్శన్, పడిక్కల్.. కానీ చివర్లో..
2023లో అంతర్జాతీయ టీ20క్రికెట్లో అరంగ్రేటం చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకు 74 టీ20 మ్యాచ్లు ఆడాడు. 44 సగటుతో 1934 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, 11 అర్థశతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 147 ఫోర్లు, 97 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు వీరే..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 71 మ్యాచ్ల్లో 159 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్ల్లో 124 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 81 మ్యాచ్ల్లో 108 సిక్సర్లు
