Yuvraj Singh : టీమిండియా సెలెక్టర్లకు యువరాజ్ సింగ్ స్ట్రాంగ్ మెసేజ్.. ఆ ముగ్గురికీ వన్డేల్లో ఛాన్స్ ఇవ్వాల్సిందే!
Yuvraj Singh : టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సెలెక్టర్లకు కీలక సూచన చేశారు. ఆ ముగ్గురు యువ క్రికెటర్లకు వన్డేల్లో అవకాశం ఇవ్వాలని అన్నారు.
Yuvraj Singh
Yuvraj Singh : టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సెలెక్టర్లకు కీలక సూచన చేశారు. భారత క్రికెట్ జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు కల్పించాలని, ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లను వన్డే జట్టులోకి తీసుకోవాలని సూచించారు.
ముగ్గురు యువ క్రికెటర్లు 50 ఓవర్ల ఫార్మాట్లో తరచూ ఎంపిక చేయకపోవడం వారి ప్రతిభకు తగిన న్యాయం చేయకపోవడమేనని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పీటీఐతో మాట్లాడుతూ యువరాజ్ ఈ కామెంట్స్ చేశాడు.
అభిషేక్ శర్మను వన్డే క్రికెట్లో ఆడితే చూడాలని ఉందని యువరాజ్ పేర్కొన్నారు. అతనితో పాటు ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లకు కూడా 50 ఓవర్ల ఫార్మాట్లో అవకాశాలు కల్పించాలని సెలెక్టర్లకు యువరాజ్ సూచించారు.
టీమిండియా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ ప్లేయర్లు కొనసాగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించడం కొంత కష్టమేనని యువరాజ్ సింగ్ అంగీకరించారు. అయినప్పటికీ, ప్రస్తుతం యువ ఆటగాళ్లు ప్రదర్శిస్తున్న ఆటతీరును పరిశీలిస్తే త్వరలోనే వారికి జట్టులో అవకాశం దక్కుతుందని యువీ ఆశాభావం వ్యక్తం చేశారు.
