Samantha : 8 నెలల్లో 120 కోట్లు సంపాదించిన సమంత..? అది కూడా ఒక్క బిజినెస్ తోనే..?
సమంత బిజినెస్ ఇప్పుడు చర్చగా మారింది. (Samantha)
Samantha
Samantha : ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ కొట్టిన సమంత ప్రస్తుతం ప్రగ్నెన్సీ బ్రేక్ ని ఎంజాయ్ చేస్తుంది. సమంత అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. తానే సొంతంగా పలు బిజినెస్ లు కూడా స్థాపించింది. అయితే ఇటీవల తన సంస్థల్లో ఒకటైన పెర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించింది.
సమంత కొన్ని నెలల క్రితం సీక్రెట్ ఆల్కెమిస్ట్ అనే పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని స్థాపించింది. అంకితా థడానీ, ఆకాష్ వాలియా అనే మరో ఇద్దరితో కలిసి ఈ బిజినెస్ ని స్థాపించింది. అయితే ఈ బిజినెస్ ఫుల్ ప్రాఫిట్ జోన్ లో నడుస్తుంది. 8 నెలల్లోనే ఏకంగా 120 కోట్ల టర్నోవర్ కి చేరుకుందని టాక్. టర్నోవర్ 120 కోట్లు ఉందంటే లాభాలు కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తుంది.
దీంతో సమంత బిజినెస్ ఇప్పుడు చర్చగా మారింది. సమంత పెర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ ఇప్పుడు బిజినెస్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క కంపెనీతోనే ఇంతలా సంపాదిస్తుంది అంటే మిగిలిన బిజినెస్ లతో సమంత ఏ రేంజ్ లో సంపాదిస్తుందో అని లెక్కలు వేస్తున్నారు. సమంతకు ఈ పెర్ఫ్యూమ్ బిజినెస్ తో పాటు సాకి అనే క్లాతింగ్ బిజినెస్, ఏకం అనే ప్రీ స్కూల్ బిజినెస్, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ, పికెల్ బాల్ లో చెన్నై సూపర్ చాంప్స్ అనే టీమ్ తో పాటు మరో అయిదు రంగాల్లో బిజినెస్ లు ఉన్నాయి. ఇవే కాకుండా మరి కొన్ని సంస్థల్లో పెట్టుబడులు కూడా పెట్టింది సామ్.
కరోనా సమయంలో, తనకు మాయోసైటిస్ వచ్చిన సమయంలో ఖాళీ ఉన్నపుడు బిజినెస్ ల మీద బాగా రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెట్టి ఇప్పుడు కోట్లు సంపాదిస్తుంది సమంత. సినిమాల కంటే ఎక్కువ సమంత ఇప్పుడు వ్యాపార రంగంలోనే సంపాదిస్తుంది. ఈ లెక్కలు చూసి పలువురు సినీ సెలబ్రిటీలు సైతం షాక్ అవుతున్నారు.
