New Zealand A vs India A : జైస్వాల్, స్మరణ్ డకౌట్.. దంచికొట్టిన సుదర్శన్, పడిక్కల్.. కానీ చివర్లో..
New Zealand A vs India A : న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ఏ జట్టు బ్యాటింగ్‌లో తడబడుతోంది.
New Zealand A vs India A
New Zealand A vs India A : న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ఏ జట్టు బ్యాటింగ్‌లో తడబడుతోంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో భారత ఏ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు.
కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ ఏ బౌలర్ ఫ్రేజర్ షీట్ అతడిని పెవిలియన్‌కు పంపించాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి మరో ఓపెనర్ సాయి సుదర్శన్ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. నెమ్మదిగా ఆడుతూ వారు క్రీజులో పాతుకుపోవడంతో మ్యాచ్‌లో తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ ఏ జట్టు 26 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. రెండో సెషన్ ప్రారంభంలోనే వికెట్లు పడ్డాయి.
సాయి సుదర్శన్ 63 బంతుల్లో 41 పరుగులచేసి ఔట్ కాగా.. దేవదత్ పడిక్కల్ 140 బంతుల్లో 80 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 91 పరుగులు జోడించడంతో భారత ఇన్నింగ్స్ కాస్త కుదుటపడింది. అయితే, జర్రోడ్ మెకే బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయిన సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ మిస్ చేసుకోగా.. అతని తరువాత క్రీజులోకి వచ్చిన యశ్ రాథోడ్ 13 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత పడిక్కల్ ప్రేసర్ షీట్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పడిక్కల్ ఔట్ తరువాత క్రీజులోకి వచ్చిన స్మరన్ రవిచంద్రన్ డకౌట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 137 పరుగుల వద్ద భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 40 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 55 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత ఏ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (17 నాటౌట్), మానవ్ జగ్దూసకుమార్ సుతార్ (3 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇక న్యూజిలాండ్ ఏ జట్టు బౌలర్లలో ఫ్రేసర్ షీట్ నాలుగు వికెట్లు తీయగా, బ్రెట్ రాండల్, జారోడ్ మెకే చెరొక వికెట్ తీశారు.
