×
Ad

IND vs SA : ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టారు.. దంచికొట్టిన ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ.. ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్..

IND vs SA T20 World Cup Warm Up Match : టీమిండియా బ్యాటర్లు మరోసారి అదరగొట్టారు. బ్యాటుతో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు.

IND vs SA T20 World Cup Warm Up Match

IND vs SA T20 World Cup Warm Up Match : టీమిండియా బ్యాటర్లు మరోసారి అదరగొట్టారు. బ్యాటుతో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. టీ20 ప్రపంచకప్ -2026 సన్నాహకాల్లో భాగంగా నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.

Also Read : U19 World Cup 2026: అండర్ 19 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు అదరగొట్టారు. ఇషాన్ కిషన్ కేవలం 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్ నోకియా వేసిన ఓ ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 6, 4, 6 బాదేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 18బంతుల్లో 24 పరుగులు సాధించాడు. అయితే, ఓపెనర్లు ఇద్దరూ రిటైర్డ్‌హార్ట్‌గా వెనుదిరిగారు.

ఇక మూడో స్థానంలో వచ్చిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుత ఆటతీరును కనబర్చాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. చివరిలో అక్షర్ పటేల్ (35నాటౌట్) రాణించగా.. సూర్య కుమార్ యాదవ్ (18 బంతుల్లో 24 పరుగులు), హార్దిక్ పాండ్యా (10బంతుల్లో 30 పరుగులు) రాణించారు.


భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు బ్యాటర్లు విఫలమయ్యారు. నిర్ణత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో స్టబ్స్ (45 నాటౌట్), ర్యాన్ రెకెల్‌టెన్ (44), ఐదెన్ మార్‌క్రమ్ (38) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.


ఇదిలాఉంటే.. భారత్ -శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్ పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగుతుంది. అదేరోజు వాంఖడే స్టేడియంలో టీమిండియా పసికూన అమెరికాతో తలపడుతుంది.