IND vs SL : సోనాల్ శతకం.. అయినా లంకకు తప్పని ఫాలో ఆన్..
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs SL) భారత్ పట్టు బిగించింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 26, 2026 / 10:50 AM IST
IND vs SL 2nd Test srilanka 290 all out in 1st Innings
IND vs SL : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. అంతేకాదండోయ్ లంక జట్టును ఫాలో ఆన్ ఆడిస్తోంది.
ఓవర్ నైట్ స్కోరు 265/8తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన శ్రీలంక జట్టు మరో 25 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది. సోనాల్ దినుష (103; 162 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. అయినప్పటికి కూడా అతడు ఫాలో ఆన్‌ను తప్పించలేకపోయాడు. లంక జట్టు కనీసం 304 పరుగులు చేసి ఉంటే ఫాలో ఆన్ గండం ఉండేది కాదు.
Sri Lanka all-out for 290 in the 1st innings!
3⃣ wickets each for Prasidh Krishna & Manav Suthar
2⃣ wickets for Saransh Jain
1⃣ wicket each for Mohammed Siraj & Ravindra Jadeja#TeamIndia have enforced the follow-on!Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6e0sgqR8j5
— BCCI (@BCCI) August 26, 2026
లంక బ్యాటర్లలో పసిందు సూరియబండార (80; 133 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్ రెండు వికెట్లు సాధించగా సిరాజ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
