Virat Kohli : వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డులు ఇవే..

వెస్టిండీస్‌తో తొలి వన్డేకు ముందు విరాట్ కోహ్లీని (Virat Kohli ) పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

IND vs WI 1st ODI first ODI tomorrow Virat Kohli eye on massive record

Virat Kohli : భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య ఆదివారం (సెప్టెంబ‌ర్) 27 నుంచి మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌కు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీని ప‌లు రికార్డులు ఊరిస్తున్నాయి.

అజేయ వన్డే రికార్డు..

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. ఈ రెండు మ్యాచ్‌ల్లో అత‌డు ఔట్ కాలేదు. 2018లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 105 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో కోహ్లీ 29 బంతుల్లో 33 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇక 2023లో జ‌న‌వ‌రిలో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 110 బంతుల్లో 165 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

Asian Games : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం.. ఇరాన్‌ను ఓడించి గోల్డ్ గెలుచుకున్న మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు..

దీంతో ఈ స్టేడియంలో కోహ్లీ 199 ప‌రుగులు సాధించి అజేయ‌మైన స‌గటును కొన‌సాగిస్తున్నాడు. ఆ రికార్డును ఆదివారం మ్యాచ్‌లోనూ కొన‌సాగించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

15వేల ప‌రుగుల మైలురాయి..

కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 314 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. 58.59 స‌గ‌టుతో 14941 ప‌రుగులు సాధించాడు. ఇందులో 54 శ‌త‌కాలు, 79 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. తొలి వ‌న్డేలో కోహ్లీ 59 ప‌రుగులు చేస్తే.. వ‌న్డేల్లో 15వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. అంతేకాదండోయ్‌.. వ‌న్డేల్లో 15వేల ప‌రుగుల మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన ప్లేయ‌ర్‌గా కోహ్లీ చ‌రిత్ర సృష్టిస్తాడు.

స్వ‌దేశంలో అత్య‌ధిక ప‌రుగులు..

స్వ‌దేశంలో కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 41 శ‌త‌కాలు సాధించాడు. ఇందులో టెస్టుల్లో 14 వ‌న్డేల్లో 27  చేశాడు. ఇక స్వ‌దేశంలో అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన రికార్డు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. స‌చిన్ 42 శ‌త‌కాలు సాధించాడు. ఆదివారం మ్యాచ్‌లో కోహ్లీ శ‌త‌కం బాదితే స‌చిన్ రికార్డును స‌మం చేస్తాడు. ఈ సిరీస్‌లో రెండు శ‌త‌కాల‌ను కోహ్లీ చేస్తే స‌చిన్ రికార్డును అధిగ‌మిస్తాడు.