IND vs WI : శ‌త‌కంతో చెల‌రేగిన జ‌స్టిన్ గ్రీవ్స్.. తొలి వ‌న్డేలో భార‌త ల‌క్ష్యం ఎంతంటే?

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌లో (IND vs WI) వెస్టిండీస్ బ్యాట‌ర్ జస్టిన్ గ్రీవ్స్ శ‌త‌క‌తంతో చెల‌రేగాడు

IND vs WI 1st ODI Justin Greaves century team india target is 296

IND vs WI : తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్ జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12 ఫోర్లు) శ‌త‌క‌తంతో చెల‌రేగాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 295 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ముందు 296 ప‌రుగుల లక్ష్యం నిలిచింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఓపెన‌ర్లు జ‌స్టిన్ గ్రీవ్స్, జాన్ క్యాంప్‌బెల్ (62; 60 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శుభారంభం అందించారు. ఆరంభంలో గ్రీవ్స్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగ‌గా.. కుదురుకున్నాక క్యాంప్‌బెల్ వేగంగా ఆడాడు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 135 ప‌రుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. క్యాంప్ బెల్‌ను ఔట్ చేయ‌డం ద్వారా కుల్దీప్ యాద‌వ్ ఈ జోడీని విడ‌గొట్టాడు.

Shreyanka Patil : గోల్డ్‌మెడ‌ల్‌తో భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌.. శ్రేయాంక పాటిల్ ఫోటోలు..

క్యాంప్ ఔటైనా స‌రే గ్రీవ్స్ త‌న‌దైన శైలిలో ఆడుతూ వ‌న్డేల్లో త‌న తొలి శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు. ఈ స‌మ‌యంలో భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో విండీస్ జ‌ట్టు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో నాలుగు వికెట్లు కీసీ కార్టీ (13), కెప్టెన్ షై హోప్ (12), జ్యూవెల్ ఆండ్రూ (0), గ్రీవ్స్‌, కోల్పోయింది. దీంతో విండీస్ 198 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది.

అయితే.. అమీర్ జంగూ (58 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), రోస్ట‌న్ ఛేజ్ (24 32 బంతుల్లో 3 ఫోర్లు) లు త‌మ జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రు ఆరో వికెట్‌కు 52 ప‌రుగులు జోడించారు. ఛేజ్ ఔటైనా స‌రే.. అమీర్ ఆఖ‌రి వ‌ర‌కు నిలిచి విండీస్‌కు మంచి స్కోరు అందించాడు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ నాలుగు వికెట్లు తీశాడు. ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ సాధించాడు.