Rohit Sharma : వెస్టిండీస్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డుపై కన్నేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 30, 2026 / 10:34 AM IST
IND vs WI 2nd ODI Today Rohit Sharma eye on massive record
Rohit Sharma : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు (సెప్టెంబర్ 30, బుధవారం) రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు గౌహతి ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
ఇక ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 73 పరుగులు సాధిస్తే వన్డేల్లో 12వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. సచిన్ టెండూల్కర్, విరాత్ కోహ్లీలు మాత్రమే రోహిత్ కన్నా ముందు ఈ ఘనత సాధించారు.
2007లో వన్డేల్లో అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు 289 మ్యాచ్‌లు ఆడాడు. 48.9 సగటుతో 11927 పరుగులు సాధించాడు. ఇందులో 34 శతకాలు, 64 అర్థశతకాలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్కోరు 264 సాధించిన ఆటగాడి రికార్డు అతడి పేరిటే ఉంది. ఇక వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు అతడే.
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 463 వన్డేల్లో 18426 పరుగులు
* విరాట్ కోహ్లీ – 315 వన్డేల్లో 15080 పరుగులు
* రోహిత్ శర్మ – 289 వన్డేల్లో 11927 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 308 వన్డేల్లో 11221 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ – 340 వన్డేల్లో 10768 పరుగులు
200 వికెట్లకు రెండు అడుగుల దూరంలో..
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డేల్లో రెండు వందల వికెట్ల క్లబ్‌లో అడుగుపెట్టేందుకు కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే అతడు 200 వన్డే వికెట్లు సాధించిన తొమ్మిదవ భారత బౌలర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
2017లో వన్డేల్లో అరంగ్రేటం చేసిన కుల్దీప్ ఇప్పటి వరకు 122 మ్యాచ్‌లు ఆడాడు. 198 వికెట్లు పడగ్టొటాడు. ఇందులో 4 వికెట్ల వికెట్ల ఘనత 10 సార్లు, 5 వికెట్ల ఘనత 2 సార్లు సాధించాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. 269 మ్యాచ్‌ల్లో 334 వికెట్లు పడగొట్టాడు.
